భారత రాజ్యాంగంలోని 105వ సవరణ ఉద్దేశం ఏమిటీ? ఎందుకు సవరించాల్సి వచ్చింది?
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరో కీలక బిల్లు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో మరో కీలక సవరణ చేసింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఇదివరకే ఆమోదించాయి. దాన్ని రాష్ట్రపతిభవన్‌కు పంపించాయి. తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ బిల్లును ఆమోదించారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను జారీ చేశారు. దీనితో రాజ్యాంగంలో 105వ సవరణ చట్టం ఇక మనుగడలోకి వచ్చినట్టయింది.
ఈ చట్టం ప్రకారం- సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల వారిని గుర్తించే అధికారం ఇక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉంటుంది. ఓబీసీ, ఈబీసీలను గుర్తించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బదలాయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338బీ క్లాజ్ (9), ఆర్టికల్ 342ఎలో సవరణలు చేసింది. ఈ రెండు ఆర్టికల్స్ ప్రకారం.. ఇప్పటిదాకా కూడా సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో వెనుకబడిన తరగతులను బీసీగా, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖల్లో ఓబీసీలుగా విభజిస్తూ వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇందులో సవరణలు చేసింది. ఆర్టికల్ 342ఎలో మార్పులు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అవసరాలు, కార్యకలాపాల కోసం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని బదలాయిస్తున్నట్లు పొందుపరిచింది.
దీనికి సంబంధించిన బిల్లును ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల 11వ తేదీన వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పెగాసస్ హ్యాకింగ్ ఉదంతంపై అప్పటిదాకా లోక్‌సభ, రాజ్యసభలను స్తంభింపజేస్తూ వచ్చిన కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీల సభ్యులందరూ.. ఒక్కసారిగా కేంద్రానికి అండగా నిలిచారు. ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఉభయ సభల ఆమోదం పొందడంతో దీన్ని రాష్ట్రపతి భవన్‌కు పంపించింది పార్లమెంట్ సెక్రెటేరియట్.
తాజాగా- దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. ఈ బిల్లుపై సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గెజిట్ జారీ చేసింది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో అన్ని పార్టీలు దీనిపై తమ అభిప్రాయాన్ని తెలిపాయి. ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. కేంద్రానికి అనుకూలంగా నిర్ణయాన్ని తీసుకుంది.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications