Inkspell’s Insight Ignition:పండుగలా అవార్డుల కార్యక్రమం..విజేతలు వీరే..!

సోషల్ మీడియా, కంటెంట్, మార్కెటింగ్ రంగాల్లో అశేష ప్రతిభ కనబర్చిన వ్యక్తులను లేదా సంస్థలను ఇంక్‌స్పెల్ యొక్క ఇన్‌సైట్ ఇగ్నిషన్ అవార్డులతో గౌరవించింది. ఇందులో కంటెంట్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2023, సోషల్ స్టార్స్ అవార్డ్స్ 2023 మరియు అడ్‌వరల్డ్ షోడౌన్ 2023 విజేతలకు అందజేసింది.

ఇండియా కంటెంట్ లీడర్షిప్ అవార్డులు 2023

గ్లోబల్ ట్రెండ్స్ ఫోరమ్‌తో కలిసి సంయుక్తంగా ఇంక్‌స్పెల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దార్శనికులను,మేధావులైన నాయకులను,సృజనాత్మకత కలిగిన వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఇండియా కంటెంట్ లీడర్‌షిప్ అవార్డ్స్ 2023 డేటా ఆధారిత కంటెంట్ స్ట్రాటజీల శక్తికి నిదర్శనంగా నిలిచింది. సమాచారాన్ని తీసుకుని తద్వారా ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు చేసిన వారిని గుర్తించి వారిని ది ఇండియా కంటెంట్ లీడర్షిప్ అవార్డ్స్ 2023తో గౌరవించడం జరిగింది.

Inkspell’s Insight Ignition- Celebrating the Triumph of Innovation and Excellence

వివిధ రంగాల నుంచి డేటా సేకరించి ఆ సమాచారంతో కంటెంట్‌ను సరికొత్తగా నిర్వచించడాన్ని ప్రధానంగా ఫోకస్ చేశారు.ఇక డేటాతో ఎన్ని రకాల విశ్లేషణలు చేయొచ్చనేది విజేతలు నిరూపించారు. భవిష్యత్తులో కంటెంట్ క్రియేషన్‌ మరో లెవెల్‌కు తీసుకెళతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. న్యాయనిర్ణేతలు విజేతలను ప్రకటించారు. ఐసీఎల్ 2023 విజేతలు అఖిలేష్ వాట్స్, జహారా కంచ్వాలా,రైట్ నాలెడ్జ్ ల్యాబ్స్, నిషిత అరోరా, జాహిద్ అహ్మద్, ఫ్రెయిర్ డిజిటల్‌ లాంటి సంస్థలు సైతం విజేతలుగా నిలిచాయి.

సోషల్ స్టార్స్ అవార్డ్స్ 2023 - సోషల్ మీడియాలో అద్భుతమైన కథనాలకు గాను..

సోషల్ మీడియా విషయానికి వస్తే, సోషల్ స్టార్స్ అవార్డ్స్ 2023 ఒక సంచలనాత్మక అంశం. డిజిటల్ ప్రపంచంలో కథ చెప్పే కళలో ప్రావీణ్యం పొందిన వ్యక్తులు మరియు బ్రాండ్‌లకు గుర్తింపు దక్కే ఏకైక వేదిక సోషల్ మీడియా .ఆకట్టుకునే వ్యక్తిగత కథనాల నుండి వినూత్న బ్రాండ్ కథనాల వరకు వివిధ రంగాల నుంచి అంశాలను తీసుకుని వాటిని లోతుగా విశ్లేషించినందుకుగాను అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో నామినేట్ అయిన వారికి ఈ వేదిక ద్వారా మంచి గుర్తింపు లభించడమే కాకుండా... ఇతరులు వీరి నుంచి స్ఫూర్తి పొందే అవకాశం దక్కింది. సోషల్ మీడియా ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రైట్ నాలెడ్జ్ ల్యాబ్స్ సొంతం చేసుకోగా...సోషల్ మీడియా స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ ట్రోఫీని ఇరాన్షీ టెక్నాలజీ కైవసం చేసుకుంది.

యాడ్‌వరల్డ్ షోడౌన్ 2023: ఒకే చోట సృజనాత్మకత ఆవిష్కరణలు

మార్కెటింగ్ ఎక్స్‌లెన్స్ కేటగిరీలో క్రియేటివిటీ సృజనాత్మకత అనే ఈ రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. అదే సమయంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి.ఈ రెండు అంశాలకు వేదికగా నిలిచింది యాడ్ వరల్డ్ షో డౌన్ 2023.బ్రాండింగ్, క్రియేటివ్ కమ్యూనికేషన్స్, అడ్వర్టయిజింగ్ కేటగిరీల్లో అత్యద్భుతమైన విజయాలను సాధించినవారిని యాడ్ వరల్డ్ షోడౌన్ 2023 అవార్డులతో గౌరవించడం జరిగింది.

తాజా ఇండస్ట్రీ ట్రెండ్స్, ఇండస్ట్రీ లీడర్స్ నుంచి విలువైన సలహాలు సూచనలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని ఆయా రంగాల్లో వారి మార్కెటింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు ఈ అవార్డుల కార్యక్రమం చక్కటి వేదికగా ఉపయోగపడింది.ఇక అవార్డుల ఫంక్షన్‌లో ఉపయోగకరమైన ప్యానెల్ చర్చలు, ముచ్చట్లు, పలువురు ప్రముఖులు ప్రసంగాలతో నిండుగా కనిపించింది.ముఖ్యంగా బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్‌ సంస్థకు చెందిన జయేష్ త్రింబక్కర్,యోగిన్ వోరా, షీషం డిజిటల్‌కు చెందిన అంకూర్ దాస్‌గుప్తా,కొటక్ లైఫ్‌కు చెందిన ప్రసాద్ పింపుల్,వర్సే ఇన్నోవేషన్‌కు చెందిన సమీర్ వోరా,హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన జాహిద్ అహ్మద్,ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియాకు చెందిన గీతాంజలి సచ్వానీ,మణిపాల్ సిగ్న హెల్త్‌ ఇన్ష్యూరెన్స్‌కు చెందిన సప్నా దేశాయ్ వంటి వారు స్పీకర్లుగా వ్యవహరించారు.

అశ్విన్ సేత్ గ్రూప్‌కు చెందిన రితురాజ్ బిద్వాయ్, జోష్ యాప్‌కు చెందిన సుందర్ వెంకట్రామన్, సెయింట్ గోబెయిన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన షర్మిలా సందీప్,గోద్రెజ్ క్యాపిటల్‌కు చెందిన షోనాలీ శెట్టి,టాటా కమ్యూనికేషన్స్‌కు చెందిన సౌగతా బగాచీ, జియో మీడియా లిమిటెడ్‌కు చెందిన తస్కీన్ నడ్కర్, రైట్ నాలెడ్జ్ ల్యాబ్స్‌కు చెందిన జహారా కంచ్వాలా, కాంటినెంటల్ కాఫీకి చెందిన రాజా చక్రబర్తిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇక ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మార్కెటింగ్ మరియు కంటెంట్ రంగాల్లో పెద్ద చర్చే జరిగింది. పలు రంగాల్లో సాధించిన ఘనతలకు కేవలం అవార్డులతోనే సరిపుచ్చలేదు.వారి సేవలు ఆయా రంగాల్లో మరింతలా కొనసాగేందుకు లేదా విస్తరించేందుకు దోహదపడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరితో పాటు స్పాన్సర్స్‌కు, పార్ట్‌నర్స్‌కు ఇంక్‌స్పెల్‌ కృతజ్ఞతలు తెలిపింది.సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలు ఇంతటితో ఆగవని అవి నిరంతర ప్రక్రియగా సాగుతాయని ఇంక్‌స్పెల్ పేర్కొంది.భవిష్యత్తులో కంటెంట్, సోషల్ మీడియా, మార్కెటింగ్ రంగాలు మరింత వృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక ఈ ఘనమైన కార్యక్రమానికి జోష్ యాప్ అధికారిక డిజిటల్ & షార్ట్ వీడియో పార్ట్‌నర్‌గా వ్యవహరించగా.. ప్రముఖ బహుభాషా న్యూస్ పోర్టల్ వన్‌ఇండియా మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరించింది.కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాలు, రానున్న కార్యక్రమాల కోసం WWW.inkspell.co.in ను సందర్శించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+