వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తియ్యగా ఉందని కదా అని చక్కెరను అధిక మోతాదులో తీసుకుంటే..: అందులో ఏం కలుపుతారో తెలుసా?

|
Google Oneindia TeluguNews

తీపి పదార్థాలను చూడగానే చాలామందికి నోరూరుతుంది. లొట్టలేసుకుంటూ తినాలనిపిస్తుంది. తింటారు కూడా. జిలేబీ, బాదుషా, జాంగ్రీ, లడ్డు వంటి చక్కెరతో తయారు చేసిన పదార్థాలను ఎప్పుడెప్పుడు తిందామా అనే ఆలోచనతోనూ చాలామంది ఉంటారు. మితిమీరిన చక్కెర పరిమాణాన్ని వినియోగించడం వల్ల మన ఆరోగ్యంపై పడే దుష్ప్రభావం గురించి పెద్దగా పట్టించుకోరు. టీ, కాఫీలోనూ మరింత ఎక్కువగా చక్కెరను కలుపుకొని తాగేవారిని మనం చూసే ఉంటాం.

 మోర్ డేంజర్..

మోర్ డేంజర్..

మోతాదుకు మించిన చక్కెర శరీరంలోకి చేరడం వల్ల సంభవించే దుష్పరిమాణాలు తెలిస్తే.. బహుశా ఆ సాహసం చేయకపోవచ్చు. చక్కెర కంటే బెల్లం వినియోగమే మంచిదంటూ నిపుణులు చెబుతుంటారు. దీనికి కారణం- చక్కెరతో పోల్చుకుంటే బెల్లంలో ఐరన్ శాతం అధికంగా ఉండటమే. భారత్‌లో మొట్టమొదటి చక్కెర మిల్లు 1868లో ఏర్పాటైంది. బ్రిటిషర్లు దీన్ని స్థాపించారు. చక్కెర మార్కెట్‌లో వినియోగంలోకి రావడానికి ముందు వరకూ బెల్లం వాడకం విస్తృతంగా ఉండేది.

 ఇదివరకు బెల్లంతోనే..

ఇదివరకు బెల్లంతోనే..

ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు ప్రజలు స్వచ్ఛమైన బెల్లంతో తీపి పదార్ధాలను చేసుకునే వారు. వాటినే తినేవారు. అందుకే మన పూర్వీకులు పెద్దగా అనారోగ్యానికి గురయిన పరిస్థితులు ఉండవు. చక్కెర అనేది ఒక రకమైన విషంగా మనం చెప్పుకోవచ్చు. ఇది అనేక వ్యాధులకు కారణమని శాస్త్రీయబద్ధంగా నిరూపితమైంది కూడా. మన రోజువారీ దినచర్యల్లో భాగంగా చక్కెర వినియోగం అనేది 10 శాతానికి మించకూడదని నిపుణులు సూచిస్తుంటారు. రోజువారీ దినచర్యలో 10 శాతం పరిమాణం వరకు చక్కెను వినియోగించుకోవచ్చని పేర్కొంది.

 సల్ఫర్‌తో తయారీ..

సల్ఫర్‌తో తయారీ..

చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. సల్ఫర్ ఎందులో వాడతారో మనకు తెలుసు కదా? బాణసంచా తయారీలో దీన్ని వాడుతుంటారు. సల్ఫర్..ఓ రసాయన మూలకం. అది మన శరీరంలోకి వెళ్లిన తరువాత.. దాన్ని ప్రక్షాళన చేయడం చాలా కష్టం. అనారోగ్యానికి దారి తీసే కొలెస్ట్రాల్ స్థాయిని ఇది పెంచుతుంది. కొలెస్ట్రాల్ అనేది పెరిగితేల గుండెపోటుకు అది దారి తీస్తుంది. చక్కెర మన శరీర బరువును పెంచుతుంది. ఊబకాయానికి కారణమౌతుంది.

బీపీ పెరగడానికీ..

బీపీ పెరగడానికీ..

చక్కెర బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది. మెదడుపై ఓ రకమైన దుష్ప్రభావాన్ని ఇది చూపుతుందని శాస్త్రీయ బద్ధంగా నిరూపితమైనట్లు నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు ఉన్న ప్రధాన లక్షణం.. మనకు తీపి తెలియజేయడం. అందులో సుక్రోజ్ శాతం అధికంగా ఉండటం వల్లే దాని తీపి అనేది మనకు తెలుస్తోంది. సుక్రోజ్‌ను మాత్రం మనుషులు జీర్ణం చేసుకోవడం కష్టం. అది అంత సులువుగా జీర్ణం కాబోదు. జంతువుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉంటుంది.

23 రకాల రసాయనాలు..

23 రకాల రసాయనాలు..

చక్కెర తయారీ ప్రక్రియలో 23 హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. డయాబెటిస్‌కు ప్రధాన కారణం చక్కెర. కడుపు పుండుకు చక్కెర ప్రధాన కారణం. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది. పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం. సాధ్యమైనంతవరకు చక్కెరను వదిలివేసి, స్వచ్ఛమైన బెల్లం తినడం ఆరోగ్యానికి అత్యంత శ్రేయస్కరం. అనేక రసాయనాలతో కలిగే పదార్థం కావడం వల్ల చక్కెర వినియోగాన్ని వీలైనంత వరకూ దూరం పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. దాని స్థానంలో స్వచ్ఛమైన బెల్లాన్ని వినియోగించాలని, దానివల్ల ఐరన్ శాతం పెరుగుతుందని అంటున్నారు.

English summary
Sugar use to less than 10% per day. Many people rely on quick, processed foods for meals and snacks. Since these products often contain added sugar, it makes up a large proportion of their daily calorie intake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X