వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దిద్దుబాటు'తో పాటే....

By Staff
|
Google Oneindia TeluguNews

కళింగాంధ్ర నుంచి గురజాడ రాసిన 'దిద్దుబాటు' కథ ఎప్పుడు ఏ పత్రికలో అచ్చయిందో అదే ఏడు అదే పత్రికలో మాడపాటి హన్మంతరావు రాసిన తెలంగాణ కథ అచ్చయింది. 1910 ఆంధ్రభారతి పత్రికలో 'దిద్దుబాటు' కథ వచ్చిన తర్వాతి రెండో సంచికలోనే వచ్చిందా కథ. 1915లోనే మాడపాటి హన్మంతరావు రాసిన 7,8 కథలతో 'మల్లికా గుచ్ఛము' కథా సంపుటి వెలువడింది. 1918లోనే తెలంగాణ మొదటి నవల వద్దిరాజు సోదరులు రాసిన 'రుద్రమదే' వెలువడింది. వాళ్లు మరికొన్ని నవలలు కూడా రాశారు. కె. శ్రీనివాస్‌ తెలంగాణా సాహిత్యం సంస్కృతి ఉద్యమాలు 1900-1940 కాలానికి సంబంధించిన కాసంపై పిహెచ్‌డి పరిశోధన చేసి ఇలాంటి ఎన్నో సంగతులు వెలికి తెచ్చారు. అలాగే తెలంగాణా పత్రికలు అనే అంశంపై సంగిశెట్టి శ్రీనివాస్‌ చేసిన తన సిద్ధాంత పరిశోధనలో ఎన్నో తెలంగాణ కథలని దొరకబట్టుకున్నారు. వారిచ్చిన ఈ సమాచారం అమూల్యమైనది.

వరంగల్‌ జిల్లాకు చెందిన నందగిరి వెంకటరావు 1927 నుండి గిరి అనే కలం పేరుతో 25కు పైగా కథలు రాశారు. 1929 నుండి భారతి, సుజాత అనే పత్రికల్లో 15,20 కథలు గిరి పేరుతో ఆయన కథలు అచ్చయ్యాయి. ఆంధ్రపత్రిక తరఫున 'భారతి' ఎట్లానో అట్లా గోల్కొండ పత్రిక తరఫున సుజాత అనే సాహిత్య పత్రిక వెలువడేది. ఇందులో ఎన్నో తెలంగాణ కథలు అచ్చయ్యాయని తెలుస్తోంది. చలం రాసిన కథలు బూతుగా వున్నాయని కోస్తా పత్రికలు వేయకపోతే 'సుజాత' పత్రికలోనే 15కు పైగా కథలు అచ్చేశారు.

నందగిరి వెంకటరావు సతీమణి నందగిరి ఇందిరాదే కూడా 1930ల నుండి చాలా కథలు రాశారు. ఆమె 1940లో నిజామాబాద్‌లో జరిగిన 'ఆంధ్ర మహాసభ' రాష్ట్ర మహాసభల్లో మహిళా సభ అధ్యక్షులుగా ఎన్నికైన పని చేసిన కార్యశీలి. ఆమె 1985 నుంచి అమెరికాలో వుంటున్నారు. సుజాత పత్రికను బి.యన్‌. శర్మ, సురవరం ప్రతాప్‌ రెడ్డి, వడ్లకొండ నర్సింహారావు వంటి ఉద్ధండులు నిర్వహించే వారు. వాళ్లు కూడా కథలు రాశారు. నందగిరి ఇందిరాదే నిజాం రాష్ట్రంలోని దక్కన్‌ రేడియోలో పని చేశారు. రేడియోలో కథలు చదిన తొలి తెలంగాణా రచయిత్రి నందగిరి ఇందిరాదే. ఆ తర్వాత డాక్టర్‌ పి. యశోదారెడ్డి.

కాళోజీతో కలిసి జంట కథకులుగా ప్రిసిద్ధి పొందిన మెదక్‌ జిల్లాకు చెందిన వెల్దుర్తి మాణిక్యరావు 1935 నుండి ఎన్నో కథలు రాశారు. ఆయన రాసిన 'ఏర్‌మేల్‌' స్వతంత్ర కథ. దయ్యాల మనుగడ కథ అనువాదమైనప్పటికీ స్వతంత్ర కథ వలె ఉంది. అందులో మెదక్‌ జిల్లా మాండలికాన్ని రాశారు. ఆ కాలంలోనే కాళోజీతో కలిసి మాణిక్యరావు భూతదయ అనే కథ రాశారు. ఇది ఆర్యసమాజ ప్రభావంతో రాసిన కథ. 1935లో గోల్కొండ పత్రికలో ఓ నాటిక కూడా ప్రచురించారు. భాస్కరభట్ల కృష్ణారావు కూడా దక్కన్‌ రేడియోలో పని చేశారు. 1935 నుండి ఎన్నో కథలు రాశారు. వద్దిరాజు సోదరుల గురించి వరంగల్‌లో 1994-96ల్లో వెలువడిన శతజయంతి సంచికలో ఎన్నో సంగతులున్నాయి. భాస్కరభట్ల కృష్ణారావు 'యుగసంధి' అనే నవలను 1945లో వెలువరించారు. ఇందులో ఆనాటి తెలంగాణ జీతం చిత్రించబడింది.

సురవరం ప్రతాపరెడ్డి కథల్ని 94-95ల్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఒక సంపుటిగా పునర్ముద్రించింది. ఆయన రాసిన 'సంఘం పంతులు' కథ కమ్యూనిస్టులు రాక ముందు తెలంగాణాలో ఆంధ్ర మహాసభ కలిగించిన చైతన్యాన్ని చిత్రించింది. 'గ్యారా కద్దూ బారా కోత్వాల్‌' (11 సొరకాయలు, 12 మంది పోలీసులు) కథ నైజాంలోని అనీతిని ఎండగడ్తూ రాసిన కథ. ఒక వ్యవసాయ రైతు లంచం కింద తలా ఒక సొరకాయ ఇస్తూ పోతే 11 సొరకాయల్లో ఒక్కటి కూడా ుగలకపోగా ఇంకో పోలీసుకు తక్కువ పడింది. సురవరం 'నిరీక్షణ' కథలో ఒక బెస్త అమ్మాయి చేపల వేట కోసం నదికి వెళ్లినతని కోసం ఎదురు చూసే ఎదరుచూపు గురించి చిత్రించారు. సురవరం 20 కథల దాకా రాశారు. 'మొగలాయి కథలు' పేరుతో 8 కథలతో ఒక కథాసంపుటి వెలువరించారు. వకీలు వెంకయ్య సంగం పంతులు సురవరం రాసిన మంచి కథల్లో కొన్ని. మొగలాయి కథలు సంపుటి కూడా ఆంధ్ర సాంస్కృతి పరిషత్తులో దొరుకుతుంది.

బోయినపెల్లి రంగారావు 1993 నుంచి చాలా కథలు రాశారు. వట్టికోట ఆళ్వారుస్వాు ప్రచురించిన 'జైలు లోపల' కథల సంపుటి నుంచి కాకుండా మరో పది కథలు అచ్చులో లభ్యమయ్యాయి. వాటిలో చిన్నప్పుడే గిర్దావర్‌, నాడునేడు, భర్త కోసం, పరిసరాలు, కాఫిర్లు మొదలైన కథలు వట్టికోట ఆళ్వారుస్వాు చిత్రించిన తెలంగాణ పరిణామాన్ని వెల్లడిస్తాయి. కె.సి. గుప్తా అణా గ్రంథమాల ద్వారా 1940లో కథాసంపుటాలు ప్రచురించారు.

ధరణికోట శ్రీనివాసులు (నల్లగొండ జిల్లా) 1938 నుండి ఆంధ్రకేసరి పత్రికలో రాసిన 'పుణ్యమా పురుషార్థమా' అనే కథ ఒకటి దొరికింది. 1947లో పర్చా దుర్గాప్రసాద రావు 'గెలుపు dుదే' కథా సంపుటి వెలువడింది. 1954-56ల్లో వట్టికోట ఆళ్వారుస్వాు సంపాదకత్వంలో పరిసరాలు పేరుతో 22 కథల చొప్పున రెండు కథా సంపుటాలు వెలువడ్డాయి.

వరంగల్‌ జిల్లాలో సాహిత్య సాధన సుతి ద్వారా 1940 నుండి ఎన్నో సాహిత్య కార్యక్రమాలతో పాటు కథా సంకలనాలు వెలువడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు కొడుకైన బూర్గుల రంగనాథరావు 1940 నుండి కథలు రాశారు. 1940 నుండి కథలు రాసిన నెల్లూరి కేశవస్వాు 1969లో 'పసిడిబొమ్మ' పేరుతో కథా సంపుటి వెలువరించారు. ఇందులో పసిడి బొమ్మ, చోటా లీడర్‌, నిట్టూర్పు, అభిమానం, ప్రజా ఉద్యోగి, మంత్రి, పాలపొంగు, క సమ్మేళనంలో, అక్కయ్య పెళ్లి, ప్రతిష్టాపరుడు, పరీక్ష, రాజర్షి, అతిథి, రాజును గురించిన కథ అను 14 కథలున్నాయి. ఆయన రాసిన 'కాపీ' అనే కథ ఆంధ్రకేసరి 1944-45 సంచికలో లభ్యమైంది. ఆయన 1940 నుండి చాలా కథలు రాశారు. 1979-80లో 'చార్మినార్‌' కథల సంపుటి వెలువరించారు. ఇందులో తెలంగాణ ప్రజల హైదరాబాద్‌ జీతాలను, మత సమస్యను చిత్రించారు. భౄస్కరభట్ల కృష్ణారావు 1940ల్లో dుజాన్‌ తదితర పత్రికల్లో ఇజ్జత్‌, సానుభూతి, తల్లి ప్రేమ వంటి కథళు రచించారు. పొట్లపల్లి రామారావు రాసిన 'జైలు' అనే కథల సంపుటి 1945లో వెలువడింది. మహబూబ్‌నగర్‌ జిల్లా వనపర్తికి చెందిన సంపత్‌రావు 1962-63లో ఆరేడు కథలతో కథాసంపుటి వెలువరించారు.

వరంగల్‌ జిల్లా నుండి కథావాటిక పేరిట కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పెండ్యాల శేషగిరిరావు, అట్లూరి అయోధ్య రామయ్య, సముద్రాల లక్ష్మీనరసయ్య 1947 నుంచి కథలు రాశారు. జ్ఞాన గ్రంథమాల 1950లో వెలువరించిన కథల సంపుటిలో ఖమ్మంకు చెందిన సర్వదేవభట్ల నర్సింహమూర్తి రాసిన 'బిక్షుకులు' పెండ్యాల శేషగిరి రాసిన ముహూర్తబలం, పాలివాళ్ల ఆస్తుల పంపకం గురించి వడ్లూరి అయోధ్య రామయ్య రాసిన 'భాగం', సముద్రాల లక్ష్మీనరసయ్య రాసిన 'బీదపెళ్లి' మొదలైన తెలంగాణ కథలు ప్రచురించబడ్డాయి. సాధన సుతి ద్వారా 1947-50ల్లో పాలవెల్లి అనే కథల సంపుటి వెలువడింది.

సినారె, ప్రొఫెసర్‌ జి. రాంరెడ్డిల ప్రాథుక ద్యా గురువైన జి. రాములు 1945లో 'ఆత్మఘోష' అనే ఒకే ఒక కథను 16 పేజీల పుస్తకంగా ప్రచురించారు. నాటి కుల సంఘాలు కులస్థులపై చెలాయించిన పెత్తనం భరించలేక ఒక ప్రజాస్వాుకవాది కుటుంబం మొత్తం 'ఇస్లాం' మతం స్వీకరించడం ఆత్మఘోష కథ. ఆర్యసమాజ్‌ వచ్చి వారిని తిరిగి హిందువులుగా మారుమని కోరితే అప్పటికే ముస్లింలతో పెళ్లయిన ఆడపిల్లల సంగతేుటని ప్రశ్నించి ఇక నుండైనా dు హిందూ సమాజంలో ఇలాంటి పీడన లేకుండా చేసుకోండి అని హితబోధ చేస్తారు. ఇది మొత్తం హిందూ సమాజంలోని ప్రజల ఆత్మఘోష. ఈ కథ ఆధునిక కథా సరిత్సాగారం, కరీంనగర్‌ జిల్లా కథలు మొదటి సంపుటిలో ఇటీవల పునర్ముద్రించబడింది. ఈయనే 1946లో ధూమపానం, తంబాకు వ్యసనాలపై బ్రహ్మపత్ర భక్త సమాజం అనే పేరుతో రాసిన వ్యంగ్య కథను పద్మశాలి మాస పత్రికలో ప్రచురించారు. పద్మశాలి మాస పత్రికలో జి. రాములు ఇతర రచనలు కూడా కొన్ని ప్రచురించబడ్డాయి. 1954లో పెరటి చెట్టు అనే రాజకీయ సామాజిక రంగాలు నిజాయితీగా వుండాలని కోరుకుంటూ అ అనీతిమయం అవుతున్న తీరును నిజాయితీ కోరేవాళ్లను 'పిచ్చి సాయన్న' అని పిలుస్తున్న తీరును 'పిచ్చి సాయన్న' నాటికలో చిత్రించారు.

ఆర్టిస్టు చంద్ర 125 దాకా కథలు రాశారు. ఆలిండియా రేడియోలో ప్రాంతీయ వార్తలు చదిన సోషలిస్టు నాయకుడు, రచయిత జి. సురమౌళి 1950 నుండి 1960 వరకు పది దాకా కథలు రాశారు. ఏడు కథల జాడ దొరికింది. కరీంనగర్‌ జిల్లా కథలు మొదటి సంపుటిలో ఈయన రాసిన 'అంగుడుపొద్దు' కథ ప్రచురించబడింది. రెండో సంపుటిలో 'ముక్కోటి బలగమోయి' కథ ప్రచురించబడింది. శాలాంధ్ర దిన పత్రికలో ఈ కథలు ఇటీవల పునర్ముద్రించబడ్డాయి. అంగుడుపొద్దు కథ ఆలంపురం సాహిత్య సభల్లో గ్రాdుణులకు ఇచ్చిన ఉత్తేజం ఏdు లేకపోగా వారిని కొత్తరకం వెట్టిగా మార్చుకొందని చిత్రించారు. హైదరాబాద్‌ రాజధానిగా 1956 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత పొడచూపుతున్న ప్రాంతీయ భేదాలు రాయలసీమ ప్రాంతం పెత్తనం గురించి తెలంగాణ ప్రజల సహృదయత గురించి రాష్ట్రం ఏర్పడ్డ 15 రోజులకే రాసిన కథ 'ముక్కోటి బలగమోయి'. ఇది తెలుగు స్వతంత్ర పత్రికలో ప్రచురింపబడింది. రాయలసీమలోని ఫాక్షన్‌ గుండాయిజం లక్షణాల్ని 1956లోనే చిత్రించిన కథ ఇది. సురమౌళి రాసిన 'వలయం' కథలో నాస్తికుడైన సీతారామారావుని ఎవరెన్నితీరులుగా భాస్తారో, అతనెన్ని తీర్లుగా ఆలోచనాపరంపరలో కొట్టుకుపోతాడో 'జీన్‌పాల్‌ సార్త్రే' అస్తిత్వవాదాన్ని ప్రతిబింబిస్తూ చైతన్య స్రవంతి శైలిలో చిత్రించిన కథ ఇది.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి 1940-55 మధ్య 50కి పైగా కథలు, కథనాలు ప్రచురించబడ్డాయి. dటిని జనసాహితి సంస్థ 1982లో పుస్తకంగా ప్రచురించింది. పి.. నరసింహారావు స్వాతంత్ర్యానికి పూర్వం జయ పేరుతో రాసిన తెలంగాణ కథ 'స్మృత కథ'లో చేర్చబడ్డది.

జి. సురమౌళి, డాక్టర్‌ సినారెల ుత్రుడైన గూడూరి సీతారాం 1952 నుండి 1970 వరకు 70 దాకా కథలు రాశారు. తెలుగు స్వతంత్ర, తెలుగుదేశం, స్రవంతి వంటి మాస పత్రికల్లో స్తృతంగా రచనలు చేసిన గూడూరి సీతారాం తన కథల్లో తెలంగాణా మాండలికానికి, ఇక్కడి సామాజిక జీతానికి పట్టం కట్టారు. ఆయన నారిగాని బతుకు కథలో గౌడుల కులవృత్తితో పాటు సామాజిక సమస్యల్ని, కుటుంబ సమస్యల్ని ఎంతో అద్భుతంగా చిత్రించారు. ఈ కథ పద్మపీఠం మాస పత్రికలో కరీంనగర్‌ జిల్లా కథలు రెండవ సంపుటిలో ఇటీవల పునర్ముద్రింపబడింది. గూడూరి సీతారాం 1956లో రాసిన 'లచ్చి' కథలో ఈత చాపలల్లుతూ సంచార జీతం గడిపే పిచ్చకుంట్ల కులాల జీతాన్ని వారి కుటుంబ సంబంధాలను, అందులోని క్రూరమైన మగ పెత్తనాన్ని గొప్పగా చిత్రించారు. 'మారాజు' కథలో కరీంనగర్‌ జిల్లా నుండి 150 ఏళ్లుగా సాగుతున్న బొంబాయి వలస జీతాన్ని చిత్రించారు. ఈ కథ 1957లో ఆంధ్రప్రభ dక్లీలో ప్రచురించబడి ఇటీవలే తిరిగి అదే పత్రికలో పునర్ముద్రింపబడింది. ఇది కరీంనగర్‌ జిల్లా కథలు మొదటి సంపుటిలో చేరింది. ఆయన 'రంగడు' కథలో మారుతున్న భూస్వామ్య జీతాన్ని 'రాజమ్మ రాజీరుకం' కథలో లాసవంతమైన జీతం పట్ల ఆకర్షింపబడి మోసపోయి బిక్షగత్తెగా మారిన స్త్రీ గురించి, చీకటి గొడుగు కథలో లైంగిక సంబంధాల గురించి చిత్రించారు. ఇంకా అందని ఆకాశం, అమ్మాయి, అబ్బాయి, దెబ్బ తిన్న అహంభావం, రామచంద్రులు, ఎర్రపువ్వు, బస్సొచ్చింది వంటి కథలు రాసిన గూడూరి సీతారాం తెలంగాణా కథకుల్లో ఒక ముత్యాల పేరు. తెలుగులోని గోపిచంద్‌, మాగోఖలే, కరుణకుమార, చింతా దీక్షితులు సరసన చేర్చవలసిన గూడూరి సీతారాంను 1950-60, 1960-70 దశాబ్దాల కథా సంకలనాల్లో పేరుకు కూడా లేకుండా చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సదాశివ 5వ తరగతి పాఠ్యపుస్తకంలో నక్సలైట్‌ ఉద్యమం, గిరిజనుల్లో పొతుకోకముందే 1980లో కొమురం భీం జీతాన్ని కథ రాసి రాష్ట్రానికి అందించారు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, చెరబండరాజులు కూడా కొన్ని కథలు రాశారు. తాడిగిరి పోతరాజు 1960 నుండి 30 దాకా కథలు రాశారు. అయితే ఒక ప్లవ కథా ప్రవక్త 1980లో తేలి తాను కళ్లు తెరిచినప్పుడే తెలంగాణా కథ కళ్లు తెరిచిందని తాను పుట్టిన తర్వాతే ఆడం, ఈవ్‌లు పుట్టారని సృజన, అరుణతార, నూతన మాస పత్రికల్లో రసం సభల్లో, ఇంకా దిన వార పత్రికల్లో 25 ఏళ్లుగా రాస్తూనే వున్నారు; ప్రసంగాలు చేస్తూనే వున్నారు. తద్వారా అది నిజమే కావచ్చుననుకొనే కొత్త తరం వచ్చింది; ను్మంది. తద్వారా 70 ఏళ్ల తెలంగాణ కథకు తీరని అన్యాయం జరిగిందనేది వాస్తవం. కె. శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌, డాక్టర్‌ మలయశ్రీ, డాక్టర్‌ కాలువ మల్లయ్య, పత్తిపాక మోహన్‌ వంటి పరిశోధకులు 1910 నుండి కాసం చెందిన తెలంగాణ కథల్ని వెలికి తీసి ఇప్పుడు కొత్త చరిత్రని రాస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X