వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-36

By Staff
|
Google Oneindia TeluguNews

జీవితం మీద ఇదో పెద్ద దెబ్బ. చచ్చిన రసూల్‌ అదృష్టవంతుడా, బతికున్న తాను అదృష్టవంతుడా అంతు చిక్కడం లేదు రాంరెడ్డికి. ఎవరికి వారు కాకుల్లా పొడుస్తున్న బాధ. తనలో అపరాధ భావన. చేసేందేమీ లేదు. ఊరికి వెళ్లొద్దంటే వెళ్లాడు. ఊళ్లో ప్రాణాలకు ముప్పు వుండడం వల్లనే హైదరాబాద్‌ చేరాడు. భూముల గొడవల్లో తలదూర్చిన వ్యవహారం ఇంతదాకా తెచ్చింది. పెద్ద పాము పడగనే తొక్కాడు రసూల్‌.

పెద్దొర, రిటైర్డ్‌ జడ్జితో గొడవ పడ్డాడు. వరుసగా రాస్తూ పోతుంటే పత్రికలవాళ్లు అచ్చేసుకుంటూ పోయారు. ఆ గొడవ నక్సలైట్లకు మంచి అవకాశాన్నిచ్చింది. నక్సలైట్‌ కార్యకలాపాలు పెరిగిపోయాయి. మరో గొడవలో ఏకంగా స్థానికంగా పని చేసే పోలీసాఫీసరుతోనే వైరం పెంచుకున్నాడు. రసూల్‌ మీద నక్సలైట్‌ ముద్ర పడిపోయింది. అక్కడ లేని పరిస్థితి ఇక్కడికి చేర్చింది. అవన్నీ తెలుసు కాబట్టే ఊరికి వెళ్లొద్దని చెప్పాడు రాంరెడ్డి. అయినా వినలేదు. చెప్పా పెట్టకుండా రాత్రులకు రాత్రులు వెళ్లి రావడం రసూల్‌కు అలవాటేనని చాలా రాంరెడ్డికి చాలా రోజుల తర్వాత తెలిసింది.

ఊరేగింపు ముఖ్యమంత్రి ఇంటి ముందుకు చేరుకుంది. జర్నలిస్టుల ముఖాల్లో కాంతి లేదు. ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తోంది. జర్నలిస్టు యూనియన్‌ నాయకులు మరింత ఆందోళనగా కనిపించారు. హోం మినిస్టర్‌ రిజైన్‌ చేస్తాడని ముఖ్యమంత్రి హామీ ఇచ్చేవరకు కదలబోమని రోడ్డు మీద బైఠాయించారు. ఇంకో సందర్భంలోనైతే అలా కూర్చోవడం నామోషీగా భావించేవారు. కానీ అవేవీ మనసుకెక్కే పరిస్థితి లేదు. ఎవరూ చెప్పకుండానే ఎవరికి అహాలను, బిడియాలను, డాంబికాలను వదిలేశారు.

ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఉద్రిక్తంగా ఉంది. హోం మినిస్టర్‌ సిఎంకు చాలా సన్నిహితుడు. అతడ్ని రాజీనామా చేయిస్తే రెండు రకాలుగా ప్రభుత్వం ఓడినట్లవుతుంది. వేరే ఇష్యూ అయితే పరిస్థితి మరోలా ఉండేదేమో! జర్నలిస్టు నాయకులు లోనికి వెళ్లారు. బయట జర్నలిస్టులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. లోనికెళ్లిన నాయకులు అరగంటకు గానీ బయటకు రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X