వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాషువా అవార్డులకు నామినేషన్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gurram Jashuva
తెలుగు అకాడమిలో స్థాపించిన పద్మభూషణ్‌ డా. గుర్రం జాషువా పరిశోధన కేంద్రం గత రెండేళ్లుగా జాషువా గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది. అలాగే ఈ ఏడాది కూడా జాషువా 118వ జయంతిని సెప్టెంబర్ 28వ తేదీన ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలుగు అకాడమి అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన గత 2012లో జరిగిన జాషువా పరిశోధనా కేంద్రం సలహామండలి సమావేశంలో తెలుగు భాషా సాహిత్య రంగాలలో కృషిచేసిన విశిష్ట సాహితీ వేత్తలలో ఇద్దరికి (ఒక పురుషునికి, ఒక మహిళకి), జాషువా జీవిత సాఫల్య పురస్కారం, జాషువా విశిష్ట మహిళా పురస్కారం, దళిత సాహిత్యంలో కృషిచేసిన ప్రముఖులలో ఒకరికి జాషువా సాహిత్య విశిష్ట పురస్కారం ఈ విధంగా ముగ్గురికి పురస్కారం ప్రదానం చేయాలని తీర్మానించడమైంది. ఈ ఏడాది పురస్కారాలకు నామినేషన్లను ఆహ్వానిస్తూ తెలుగు అకాడమీ సంచాలకుల ఒఎస్‌డి, గుర్రం జాషువా పరిశోధనా కేంద్రం సమన్వయకర్త ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

జాషువా పేరిట ప్రదానం చేయనున్న అవార్డుల వివరాలు:

జాషువా జీవిత సాఫల్య పురస్కారం : తెలుగు భాషా, సాహిత్యరంగాలలో విశిష్ట కృషిచేసిన ప్రసిద్ధ సాహితీ వేత్తలు (60 ఏళ్ళు పైబడినవారికి)

జాషువా సాహిత్య విశిష్ట పురస్కారం: దళిత సాహిత్యంపైన కృషి చేసిన సుప్రసిద్ధ సాహితీవేత్తలు (50 ఏళ్ళు పైబడినవారికి)

జాషువా విశిష్ట మహిళా పురస్కారం : భాషా, సాహిత్య రంగాలలో విశిష్ట కృషిచేసిన సాహితీ వేత్తలు (50 ఏళ్ళు పైబడినవారికి)

పురస్కార గ్రహీతలకు సెప్టెంబర్‌ 28న జరుగు జాషువా జయంతి ఉత్సవాలలో రూ. 2 (రెండు) లక్షల నగదు బహుమతితోపాటు, మెమొంటో, శాలువాతో సన్మానం చేయడం జరుగుతుంది.

పై ప్రతిపాదనలకై సాహితీ వేత్తలను ఎంపిక చేయడం కోసం నామినేషన్లను ఆహ్వానించుచున్నాము. నామినేషన్లకు సూచనలు -

1. మీరు ప్రతిపాదించే సాహితీవేత్తలకు సంబంధించిన (నామినేషన్‌) వివరాలు సవివరంగా ఉండాలి.
2. వ్యక్తిగత నామినేషన్లు స్వీకరించబడవు.
3. ఒక వ్యక్తి ఒకరినే నామినేట్‌ చేయాలి.
4. ఈ అవార్డుల ఎంపిక పూర్తిగా పద్మభూషణ్‌ డా. గుర్రంజాషువా పరిశోధన కేంద్రం, తెలుగు అకాడమి నియమనిబంధనలు, వారిచే ఏర్పరిచిన న్యాయనిర్ణేతలసంఘం వారిదే, ఇందులో ఎటువంటి వాదోపవాదాలకు తావులేదు.
5. నామినేషన్లు మాకు చేరవలసిన చివరి తేది. 7-9-2013
6. గడువు తేది తర్వాత వచ్చిన నామినేషన్లు స్వీకరించబడవు.
7. నామినేషన్లు కో - ఆర్డినేటర్‌, పద్మభూషణ్‌ డా. గుర్రం జాషువా పరిశోధనకేంద్రం

కేరాఫ్‌/ సంచాలకులు, తెలుగు అకాడమి, 3-5-895, హిమాయత్‌నగర్‌, హైదరాబాదు - 500 029, చిరునామాకు పంపించగలరు.

ఇతర వివరాలకు :
ఫోన్‌ నం : 23220244, సెల్‌ నం. 9849225677 ను సంప్రదించగలరు.

English summary
Telugu Akademi has invited nominations from the experts for Gurram Jashuva awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X