అలిశెట్టి ప్రభాకర్ కవితాచిత్రాలు (పిక్చర్స్)

హైదరాబాద్: చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయిఅని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం హైదరాబాదులోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబుల్లాఖాన్ ఆడిటోరియంలో అలిశెట్టి ప్రభాకర్ కవితాచిత్ర ప్రదర్శన, ఆయన రచించిన ‘అక్షర నక్షత్రమ్మీద' పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ సాహితీవేత్త పొ.జయధీర్ తిరుమలరావు అధ్యక్షతన జరిగింది.

ప్రముఖ పాత్రికేయులు అల్లం నారాయణ, కె.శ్రీనివాస్, ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు సుద్దాల అశోక్‌తేజ మాట్లాడారు. ప్రభాకర్ సాహిత్యంలో కవి కాళోజీ భావాలు గోచరిస్తుంటాయని అన్నారు. సాధారణంగా కొందరు కవులు లేక చిత్రకారులుగా ఉంటారే తప్ప తాను చిత్రించిన చిత్రానికి కవిత్వం కూడా తనే రాసుకునే ప్రక్రియ చాలా అరుదైన వారిలో ఉంటాయని తెలిపారు.

ప్రభాకర్ గురించి పలువురి అభిప్రాయాలతో కూడిన మరో పుస్తకం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన రచించి ముద్రణకు నోచుకోని వాటిని సేకరించి వచ్చే సంవత్సరంలో వాటిని ముద్రించడానికి తగు ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎంతోమంది కవులకు ఆయన చిత్రాలు, కవిత్వం ప్రేరణగా నిలుస్తాయని, వాటిని పుస్తక రూపంలో పొందుపరిచి ప్రచారం చేయడం గొప్ప విషయమన్నారు.

ప్రభాకర్ తను చిత్రకవితలను ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ప్రదర్శించినప్పుడు అతనికి లభించిన ఆదరణ మరువలేమన్నారు. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా అతను తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉండిపోతారని అన్నారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో తోట వైకుంఠం, చంద్ర, నిజాం వెంకటేశం, నర్సన్న, ప్రభాకర్ భార్య భాగ్య పాల్గొన్నారు.

అక్షర నక్షత్రమ్మీద ఆవిష్కరణ

అక్షర నక్షత్రమ్మీద ఆవిష్కరణ

ప్రముఖ కవి, ఛాయాచిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్ అక్షర నక్షత్రమ్మీద పుస్తకం ఆవిష్కరణ ఆదివారంనాడు హైదరాబాదులో జరిగింది.

ప్రదర్శనలో భార్య భాగ్య

ప్రదర్శనలో భార్య భాగ్య

అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాల ప్రదర్శన ఆదివారం రోజంతా జరిగింది. ఈ ప్రదర్శన సందర్భంగా ఆయన భార్య భాగ్య ఇలా..

తెలుగు చిత్రకారులు ఇలా..

తెలుగు చిత్రకారులు ఇలా..

అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్రాల ప్రదర్శన కార్యక్రమంలో ప్రముఖ చిత్రకారులు చంద్ర, వైకుంఠం ఇలా.

అలిశెట్టి కవితా చిత్రప్రదర్శనలో...

అలిశెట్టి కవితా చిత్రప్రదర్శనలో...

అలిశెట్టి కవితా చిత్ర ప్రదర్శనలో ప్రముఖ సాహితీవేత్త నిజాం వెంకటేషం, తదితరులు ఇలా కనిపించారు.

జయధీర్ తిరుమలరావు ఇలా..

జయధీర్ తిరుమలరావు ఇలా..

అలిశెట్టి ప్రభాకర్ కవితా చిత్ర ప్రదర్శన, పుస్తకావిష్కరణ సభలో వైకుంఠం, చంద్రలతో ప్రముఖ సాహితీవేత్త జయధీర్ తిరుమలరావు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+