వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీదాసు శ్రీరాములుపై జాతీయ సదస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

 National seminar on Sridasu Sreeramulu
హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి,14వ తేదీన తెలుగుశాఖ, హైదరాబాదు విశ్వవిద్యాలయం ‘శ్రీ దాసు శ్రీరాములుగారి జీవితం -సాహిత్యం' అనే అంశంపై ఒకరోజు జాతీయ సదస్సుని నిర్వహించాలని తలపెట్టింది. శ్రీ దాసు శ్రీరాములుగారు కృష్ణా జిల్లా కూరాడ గ్రామంలో ఏప్రిల్ 8, 1846 సంవత్సరంలో జన్మించి, మే 16, 1908 సంవత్సరంలో మరణించారు.

చిన్నతనంలోనే సంస్కృతాంధ్ర భాషలను అభ్యసించి తన పన్నెండవ ఏట నూజివీడు సంస్థానంలో అష్టావధానం చేసి పండితుల ప్రశంసలను అందుకున్నారు. ఇరవై సంవత్సరాల వయసుకే తర్క, వ్యాకరణ, సంగీత, సాహిత్య, వేదాంతాలలో పాండిత్యాన్ని సంపాదిందారు. తరువాత కాలంలో ఆంగ్లాన్ని అభ్యసించి 1878 సంవత్సరంలో ప్లీడరుగా మచిలీపట్నంలో ప్రాక్టీసు ప్రారంభించి, 1884లో ఫస్టు గ్రేడు ప్లీడరుగా పనిచేశారు.

తరువాత కాలంలో న్యాయవాదవృత్తిని వదిలి తన జీవితాన్నంతటినీ సాహిత్య సేవకు కేటాయించారు. ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించారు. శ్రీదేవీ భాగవతము, వైశ్యధర్మదీపిక, అభినయ దర్పణము, సంగీత రసతరంగిణి(బౌద్ధనాటకం), మాలతీమాధవము, అచ్చతెలుగు అభిజ్ఞాన శాకుంతలము, ఉత్తర రామ చరితము, ముద్రారాక్షసము, సాత్రాజితీ విలాసము మొదలైన 33 రచనలు చేశారు.

1880లో ‘కల్పవల్లి' అనే పత్రికను స్థాపించి స్ర్తీపునర్వివాహం, పాశ్చాత్యవిద్యాప్రశంస వంటి సంస్కరణ భావాలకు ఊతమిచ్చారు. ఈయన రాసిన రచనలగురించి గానీ, ఇతర రచనలతో తులనాత్మకంగా గానీ పత్రాలు సమర్పించే అవకాశం ఉంది.

English summary
University of Hyderabad Telugu department is organising national seminar on poet Sridasu Sreeramulu on February 14.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X