సాహితి
కాలంచెల్లిపోయిందనీ, నీ కథముగిసిపోయిందనీ
నీ జ్ఞాపకాల పొదరిల్లు విడిచి నేవెళ్లిపోతున్నందుకు
నన్ను మన్నించు
కొందరికిఅక్షరాల్ని నేర్పడం తెలుసు
కొందరికి నాగటి చాళ్లు వేయడంతెలుసు
నాగటి చాళ్లలో అక్షరాల్ని పండించడంనువ్వు నేర్పిన మాట నిజమే
పయ్యావు మంద విడిచి పారిపోయిందని
పరుగెత్తి పట్టి బంధించి దండించిన మాటనిజమే..
దారుల్ని తొక్కి... అలసి నిలిచినప్పుడు
పెద్దోడ్ని తోడిచ్చి పథ నిర్దేశం చేసినమాట నిజమే
ఆలమందల్ని మరిచి, నాగటి చాళ్లు విడిచి,దారి తప్పి
నీ జ్ఞాపకాల పొదరిల్లు విడిచి నేవెళ్లిపోతున్నందుకు
నన్ను క్షమించు..
నువ్వుజీవిత కాలమూ కలగన్న చెరువుగండికొట్టి పోయింది
నేను కోకిలమ్మతో ఊసులాడుకున్నతియ్యమామిడి కొమ్మ విరిగిపోయింది
కట్ట కింది కంచె కాటికితరలిపోయింది
నా బాల్యపు మధురానుభూతల ఒడి
గోరీల దడి కూలిపోయింది
అన్నింటికీ సాక్షిగా నిలిచిన ఆత్మనిఅమ్ముకొని
నన్ను గోరీని చేసి
నీ జ్ఞాపకాల పొదరిల్లు విడిచివెళ్లిపోతున్నందుకు
నన్ను క్షమించు
ఎడమకాలువల్లో రక్తపుటేరులుపారుతున్నప్పుడు
డంకెల్ భూతం నాగటి కర్రునువిరగ్గొడుతున్నప్పుడు
వరి చేలు మరుభూములుగామారుతున్నప్పుడు
నేను కన్నీటి కాల్వనై,నిన్నోదార్చలేనందుక
బాపూ! నన్ను క్షమించు!!
-డా॥ కె. లింగారెడ్డి
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications
