సాహితి
కొస్తున్నవే
నాయినా
కలలోన కదిలొచ్చి
ఎదలోన కూసుంట
కొస్తున్నవే
యేడేండ్లు దాటినా
యెద అడుగులా పచ్చె
సుద్ది చెప్పిన సూపు
ఇగురం చెప్పిన రూపు
కొస్తున్నదే
నాయినా
మల్లెపువ్వు మనసు
మది తాకుతున్నదే
నడవబోయినకాళ్లు
తారాడుతుంటే
నడిచొచ్చిన కాళ్లు
ఏలిచ్చి తల నిమిరె
సగసగం మాటలకె
సల్లబడినా మది
ముద్దిచ్చుకుంటనే
సద్దులే తినిపిచ్చె
ఊర పొద్దుకాల
ఉప్పెనై ఉరికొచ్చి
కాళ్లల్ల ఊగినా
ఉయ్యాల జంపాల
కొస్తున్నదే
నాయినా
ఎన్నేండ్లు గడిసినా
ఎద నిడువనంటదే
(దీర్ఘకవితలోంచి కొంత భాగం)
-ఎలికట్టె శంకర్
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications