• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మళ్లీపిట్టలొస్తాయి

By Staff
|

రెల్లుపూల దుక్కం మీద

మరో రాత్రి పొద్దు గూకింది

అన్ని రాత్రులూ రాత్రులు కానట్టే

అన్ని ఉదయాలూ ఉదయాలు కావు

రెక్కలమీద వేకువ వర్తమానంతో

చెట్ల కొమ్మల మీద పిట్టలు వాలటం

గాలి దప్పిక తీరుస్తూ పాటెత్తుకుని

పరిసరాల్ని ప్రభావితం చెయ్యటం

ఇక్కడ మామూలే....

ఏ దుమారం కనుగుట్టిందో

ఏ దుందుడుకు గాలి ఆరా తీసిందో

పిట్టలు వాలిన సందర్బాన్ని

పిడుగుపాటుగా భావించి

రాత్రికి రాత్రి పాట మీద కత్తి గట్టిందికాలం...

ఓతెల్లారని తెల్లారి పూట

మళ్లీ రాత్రయింది

చరణాలు చరణాలుగా పాట చిట్లిపోయింది

తలలు విరబోసుకుని ఊడలు దిగిన మర్రి...

దాని నీడలో నూకలు చెల్లిపోయిన పిట్టలు

ఇక్కడరాత్రులు కొత్త కాదు

రాత్రుల్ని గాయిపెట్టే శబ్దాలూ కొత్తకాదు

శబ్దాల్ని మించి ప్రకంపించే

నిశ్శబ్దాలూ కొత్త కాదు

నిశ్శబ్దాల్నిండా ప్రవహించే

నిశ్చల నిశ్చయాలూ కొత్త కాదు

మాగిపొద్దెక్కినా

మసక దిగని దినాలున్నట్టే

చీకటి చెర విప్పుకుంటున్న రాత్రులూఉంటాయి

ఊపిరులున్నంతకాలం శ్వాసించనట్టే

నేల ఉన్నంత కాలం పిట్టలూ ఉంటాయి

కొమ్మలు గొంతెత్తి పిలుచుకుంటాయి

ఆకులఆరాటాలు తీర్చడం కోసం

మరిన్ని వెల్తురు పాటలతో

మళ్లీ పిట్టలొస్తాయి

చెట్ల తలలో పొద్దుపూలు తురమడంకోసం

మళ్లీ పిట్టలొస్తాయి

నేత రాత్రుల మీద

వెన్నెల జలపాతాలై కురిసేందుకు

మళ్లీ పిట్టలొస్తాయి

-వఝల శివకుమార్‌

  • సిరాచుక్క

  • సశేషం....

  • పిల్లలునిద్దరోతున్నారు

  • నేనుబహువచనం

  • అటువైపుకి

  • వెనిజులా!వెనిజులా!

  • మ్యారేజ్‌

  • పరాయికరణ

  • ఉనికి

  • నేను

  • తెలంగాణకాశ్మీరు కాదు!

  • హైకూలు

  • చకోరాలు

  • మావూరు

  • అమృతం

  • అమెరికా- చమురు

  • రోడ్డు

  • లతీఫ్‌- సామేలులు

  • రూట్స్‌

  • మర్ఫా

  • పాషాణం

  • గుడ్లగూబ

  • మొగిలిచెర్ల

  • నాకలల పునాదులు

  • విజయంగొడ్డలిది కాదు చెట్టుదే

  • చేలోకిపురుగులొస్తున్నాయి

  • సహజీవనంవర్ధిల్లు గాక!

  • మొబైల్‌పక్షులు

  • చెలిమి

  • క్షీరదాలు

  • ఉభయచరాలు- అండజాతులు

  • డివైన్‌రోమాన్స్‌

  • కొత్తపుట్టుక

  • సంకల్పబలం

  • సముద్రజీవులు

  • ఎలానడుస్తావో

  • వానకిటికీ

  • విశ్వమానవత

  • చిలుక

  • మబ్బులు

  • ఆగంతకుని స్వప్నం

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X