మావూరి పూల మొక్క
కొన్నియేళ్ల కింద
కొత్తగా విమానమెక్కి
సముద్రాల్ని దాటేటప్పుడు
తోడుగా వుండేందుకు
చిన్నచెయ్యి సంచిలో
వొక చిన్నారి పూలమొక్కనూ
వొక సీతాకోక చిలుకనూ
వెంబడి తెచ్చుకున్నా
మట్టివేళ్లలో ఆపేక్షల తడినీ
పచ్చని ఆకుల్లో పిల్లగాలుల హొయలునీ
మెత్తని సీతాకోక చిలుక రెక్కల్లో
యవ్వనపు గరుకుదనాన్నీ
పూల రెమ్మల ఎరుపుదనంలో
వెంట తెచ్చుకున్నా
నాతోటి
దేశాలు దాటి వచ్చిన
మా వూరి మొక్కను
యెక్కడ నాటాలో తెలియక
నాలోనే
తలకిందులుగా
నాటుకున్నా
తలలోంచిబయటకు పెరిగిన
వేళ్లు
భూమినీ ఆకాశాన్నీ
వొక్కటి చేసే ప్రయత్నంచేస్తున్నయి
కండరాల్లోకికాండమూ
నెత్తురులోకి పూల ఎరుపుదనమూ
చొచ్చుకుపోయి
శరీరమంతా వ్యాపించింది
నా చిన్నారి మొక్క
వెంటవచ్చిన సీతాకోక చిలుక
నా తల చుట్టే తిరుగుతూ
చెంపల మీద పసిడి రెక్కలతో
సుతిమెత్తగా నిమురుతోంది
యెటుచూసినా నా లోపల
నక్షత్రాల్లా విత్తనాలు
మిల మిలలాడుతూ
గల గలా నవ్వుతున్నయి
ఇంకఇప్పుడు
సన్నగిల్లుతున్న నమ్మకాలకు
ధీముగా
ప్రపంచమంతా
మా వూళ్లను నాటొచ్చు
-నారాయణస్వామి
భూమిభాష
జలపాతం
ఒకానొకరాత్రి న్యూయార్క్‌లో...
జంతర్‌మంతర్ పెట్టె
బాపూ!నన్ను మన్నించు!!
ఈదీ
మళ్లీపిట్టలొస్తాయి
సిరాచుక్క
సశేషం....
పిల్లలునిద్దరోతున్నారు
నేనుబహువచనం
అటువైపుకి
వెనిజులా!వెనిజులా!
మ్యారేజ్
పరాయికరణ
ఉనికి
నేను
తెలంగాణకాశ్మీరు కాదు!
హైకూలు
చకోరాలు
మావూరు
అమృతం
అమెరికా- చమురు
రోడ్డు
లతీఫ్- సామేలులు
రూట్స్
మర్ఫా
పాషాణం
గుడ్లగూబ
మొగిలిచెర్ల
నాకలల పునాదులు
విజయంగొడ్డలిది కాదు చెట్టుదే
చేలోకిపురుగులొస్తున్నాయి
సహజీవనంవర్ధిల్లు గాక!
మొబైల్‌పక్షులు
చెలిమి
క్షీరదాలు
ఉభయచరాలు- అండజాతులు
డివైన్‌రోమాన్స్
కొత్తపుట్టుక
సంకల్పబలం
సముద్రజీవులు
ఎలానడుస్తావో
వానకిటికీ
విశ్వమానవత
చిలుక
మబ్బులు
ఆగంతకుని స్వప్నం












Click it and Unblock the Notifications