కవి 'స్వరం': వదులుకోక తప్పదా..?

కవి తాత్వికుడు. తత్త్వవేత్త కాలేని కవి ఉండడు. రాజకీయ తాత్వికత మాట పక్కన పెడితే జీవన తాత్వికత అనేది కవిని సర్వామోదయోగ్యుడిని చేస్తుంది. కవిసంగమంలో నిత్యం తన కవిత్వాన్ని రాస్తున్న చాంద్ జీవన తాత్వికతను తన పద్యంలో పలికాడు. ఒక్కటి పొందితే, మరోటి వదులుకోవాల్సి వస్తుందనే సత్యాన్ని ఆయన అత్యంత సులభమైన పదాలతో, వాక్యాలతో నిర్మల హృదయంతో చెప్పాడు.

వదులుకోక తప్పదా అనే చాంద్ కవిత చదివితే అందులో సంక్లిష్యత, పదాడంబరం కనిపించదు. అలంకార పటాటోపం ఉండదు. కానీ, అతి సాధారణమైన పదజాలంతో అత్యంత చాతుర్యమైన నిర్మాణ పద్ధతి ఈ కవితిలో ఉంది. బాల్యాన్ని పోగొట్టుకున్న తండ్రిని బాలుడైన కుమారుడు వేసే ప్రశ్నతో కవిత ప్రారంభమై, త్యాగం లేని ప్రేమ ఎన్నిటకీ పూయని మొగ్గలాంటిది కన్నా అనే వాక్యాలతో ముగుస్తుంది. ఆ నిర్మాణ పద్ధతిని గమనిస్తే కవి పాఠకుడిని తన వైపు లాక్కుని వెళ్లే నిర్మాణ వ్యూహమేదో ఉందనే విషయం తప్పకుండా బోధపడుతుంది.

ఎండిన ఆకులను చెట్టు వదులుకుని పచ్చని ఆకులను ఇస్తుంది. అలాగే మనిషి తన బాల్యాన్ని వదులుకుని ఎదుగుతాడు. అయితే, ఆ ఎదుగుదల మానవత్వం వైపు ఉండాలనే విషయాన్ని చాంద్ తన చివరి మాటలతో ముగిస్తాడు. మొగ్గ పుష్పంగా మారకపోతే సంతోషం ఏది, సౌరభం ఏది.. ప్రేమించడం ముఖ్యమని, ప్రేమించినప్పుడు త్యాగం చేయకతప్పదని చాంద్ చెప్తాడు. ఇది సూఫీకవిత్వానికి కవిత్వానికి దగ్గరగా ఉంది. నిర్మమమకారంగా జీవన సత్యాలను వెల్లడించే తాత్వికత అది. వేమనలాంటి వారికే అది సాధ్యమైంది. చాంద్ తప్పకుండా మరిన్ని మంచి కవితలు రాస్తాడని, రాయాలని ఆశిస్తూ...

- కాసుల ప్రతాపరెడ్డి

చిన్నోడు అడిగాడు
నాన్నా వదులుకోక తప్పదా
ఒకటి కావాలంటే మరొకటి
వాడి ప్రశ్నతో నేను ఉదయించాను ఈ రోజు
అవును వదులుకోక తప్పదా అని

*******
ఎండిన ఆకులును కొమ్మ వదులుకొని
పచ్చని ఆకులుకు జన్మనిస్తాది
రాత్రి వెన్నెలను వదులుకొని
వెచ్చటి సూర్యున్ని రమ్మంటుంది
అమ్మ వ్రేళు వదలకుంటే
నేను నడక నేర్వలేనుగా
బాల్యపు ఒడి వీడకుంటే
ఎదిగిన నన్ను చూసేవాడినా
అడుగు అడుగునా
ప్రతీ అడుగునూ వదిలే నడవాలి
గతం విడిచిన శ్వాస వంటింది
మరలా వాస్తవాన్ని శ్వాసించాల్సిందే
కంటి రెప్ప కన్నీటిని వదలకుంటే
గుండె భారం తీరదు కదా

*******
నేను
వాడి తల నిమురుతూ అన్నాను
సిద్దంగా ఉండు
ఎప్పుడూ ఏదో ఒకటి వదలడానికి
విలువైనవన్నీ పొందాల్సిన రహస్యం
ఏదో ఒకటి కోల్పోవడంలోనే దాగివుంది
త్యాగం లేని ప్రేమ కూడా
ఎప్పటికీ పూయని మొగ్గలాంటిది కన్నా

- చాంద్

కవిసంగమం గ్రూప్ కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/groups/kavisangamam/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+