ఆకాశంలో అద్బుతం.. పింక్ మూన్ ఇండియాలో ఎప్పుడు కనిపిస్తోంది.. ఆ స్టోరీ ఏంటి ?

ఆకాశంలో మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఎప్పుడూ దగ దగ మెరుస్తూ తెల్లగా కనిపించే చంద్రుడు.. ఇవాళ కొత్త రంగను సంతరించుకున్నాడు. చంద్రుడిని సాధారణంగా ఎరుపు, పసుపు, నలుపు చూసి ఉంటాం. మార్చిలో బ్లడ్ మూన్ కనిపించిన తర్వాత, ఏప్రిల్‌లో ఇంకో అద్భుత దృశ్యం మనం చూడబోతున్నాం. ఈరోజు రాత్రి పింక్ కలర్ లో చూస్తారని అంతర్జాతీయ స్థాయిలో చూడనున్నారు. ఆ స్టోరీ ఏంటో మీకోసం ప్రత్యేకంగా....

పింక్ మూన్ అంటే ఏంటి?

ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చే మెుదటి పౌర్ణమిని.. మైక్రో మూన్ గా పిలుస్తుంటారు. ఇది వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనికి గుర్తుగా ఏడాదిలో వచ్చే తొలి పౌర్ణమిని పింక్ మూన్ గా పిలుస్తారు. వసంతకాలంలో వికసించే పువ్వు అని అర్థం వచ్చేలా పింక్ మూన్ అనే పేరు పెట్టారు. దీన్ని "మైక్రో మూన్" అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఈ సమయంలో చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉంటాడు కాబట్టి కొద్దిగా చిన్నగా కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఒక్కో దేశంలో అవి ఉన్న అక్షాంశ, రేఖాంశ స్థానాల దృష్ట్యా చంద్రుడు విభిన్నంగా కనిపిస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

a-miracle-in-the-sky-when-is-the-pink-moon-visible-in-india-what-is-the-story

నిజంగానే పింక్ కలర్ లో చంద్రుడు కనిపిస్తాడా?

అయితే నిజానికి చంద్రుడు పింక్ కలర్ లో కనిపిస్తాడా అంటే కచ్చితంగా చెప్పలేము. వసంత కాలంలో వచ్చే తొలి పౌర్ణమి కావడంతో సహజంగా పింక్ మూన్ అని పేరు వచ్చింది. అయితే సాధారణ రోజుల్లో కంటే చంద్రుడు కాస్త చిన్నగా.. కొత్త తరహా రంగులో మాత్రం కనిపిస్తాడని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. కాలమానాల్లో వ్యత్యాసాల దృష్ట్యా.. తొలిగా అమెరికాలో ఈ పింక్ మూన్ ను చూడవచ్చు. ఇక భారత కాలమానం ప్రకారం ఆదివారం రోజున ఈ పింక్ మూన్ ను వీక్షించవచ్చు. అయితే ఇందుకోసం తెల్లవారు జామునే నిద్ర లేవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 13 ఉదయం 5 గం.ల ప్రాంతంలో ఆకాశంలో ఈ పింక్ మూన్ ను దర్శనమిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఈ పేరెక్కడి నుంచి వచ్చింది?

1930లలో ఓల్డ్ ఫార్మర్స్ అల్మానాక్ అనే పత్రిక పౌర్ణములకి పేర్లు పెట్టడం మొదలుపెట్టింది. అందులో ఏప్రిల్‌లో వచ్చే పౌర్ణమిని పింక్ మూన్ అని పిలిచారు. అమెరికాలోని తూర్పు ప్రాంతాల ఆదివాసులు వసంతంలో పుష్పించే "హెర్బ్ మోస్ పింక్" అనే పువ్వు పేరు మీద ఈ పేరు పెట్టారని చెబుతారు. పౌర్ణమికి కేవలం పింక్ మూన్‌నే కాదు.. ఇతర పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి. అంతే కాకుండా ఈ పౌర్ణమిని అట్లాంటిక్ తీరం వెంబడి షాడ్ చేపలు పుట్టడం ప్రారంభిస్తారు. కాలాన్ని గుర్తించడానికి తీరప్రాంత తెగలు చంద్రుడిని కాలానుగుణంగా పలు పేర్లుతో పిలుస్తారు.

ఇండియాలో పింక్ మూన్‌ను ఎప్పుడు చూడాలి..

ఈ సంవత్సరం పింక్ మూన్‌ను ఏప్రిల్ 13, ఆదివారం తెల్లవారుజామున 5:00 గంటల సమయంలో భారత్‌లో చూడొచ్చు. శనివారం రాత్రి 8:22 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. దీన్ని చూసేందుకు ప్రత్యేకమైన టెలిస్కోప్‌ లాంటివి అవసరం అవుతోంది.

ఇక మరోవైపు హిందువులకు, ఈ పౌర్ణమి హనుమంతుని జన్మదిన వేడుక అయిన హనుమాన్ జయంతితో కలిసి వస్తుంది కాబట్టి దీనికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. దీనిని సాధారణంగా హిందూ చాంద్రమాన మాసం చైత్ర పౌర్ణమి రోజున జరుపుకుంటారు. అలానే బౌద్ధులలో ఈ పౌర్ణమిని బక్ పోయా అని పిలుస్తారు. క్రైస్తవ మతపరమైన క్యాలెండర్‌లో, ఈ పౌర్ణమిని పాస్చల్ మూన్ అని పిలుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+