ఫ్లైట్ మోడ్‌తో స్మార్ట్ ఫోన్స్‌కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా..?

నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్‌లు ప్రతి ఒక్కరి జీవితంలో అంతర్భాగంగా మారాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్‌లలోని అన్ని ఫీచర్ల గురించి చాలా మందికి పూర్తి అవగాహన ఉండదు. అలాంటి తక్కువగా ఉపయోగించే ఒక ఫీచరే "ఎయిర్‌ప్లేన్ మోడ్" లేదా "ఫ్లైట్ మోడ్".

సాధారణంగా నెట్‌వర్క్ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దీనిని ఉపయోగిస్తారని చాలా మంది భావిస్తారు. కానీ ఈ ఫ్లైట్ మోడ్‌కు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి, అవి స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

airplane-mode-benefits-for-smartphones

బ్యాటరీ లైఫ్..

ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేస్తే ఫోన్ నెట్‌వర్క్ సెర్చ్ చేయడం ఆపేస్తుంది. దీని వల్ల బ్యాటరీ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. Wi-Fi, మొబైల్ డేటా, GPS, బ్లూటూత్‌ వంటి ఫీచర్లు డిసేబుల్ అవుతాయి కాబట్టి బ్యాటరీ 20-30% వరకు ఎక్కువ సేపు పనిచేస్తుంది. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు తాత్కాలికంగా ఫ్లైట్ మోడ్‌లో ఉంచడం ద్వారా పవర్‌ సేవ్ చేయవచ్చు.

ఛార్జింగ్ వేగాన్ని పెంచుతుంది..

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే - ఫ్లైట్ మోడ్‌లో ఫోన్ 3 నుండి 4 రెట్లు వేగంగా ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో నెట్‌వర్క్ సిగ్నల్స్, Wi-Fi, నోటిఫికేషన్ల కోసం పనిచేయదు. దీని వలన విద్యుత్ వినియోగం తగ్గి ఛార్జింగ్ వేగం పెరుగుతుంది. అత్యవసరంగా బయటకు వెళ్లాల్సినప్పుడు, ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టి ఛార్జ్ చేయండి.

డిజిటల్ డిటాక్స్..

ఎప్పుడూ ఫోన్‌లోనే గడపడం వల్ల మన మెదడు నిరంతరంగా యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్లైట్ మోడ్ ఆన్ చేస్తే నోటిఫికేషన్లు, మెసేజ్‌లు, కాల్స్ రాకుండా ఉంటాయి. దీని వలన ఫోన్ నుంచి విరామం తీసుకొని కుటుంబం, పనులు, లేదా హాబీలపై దృష్టి పెట్టవచ్చు.

పిల్లల కోసం సురక్షిత మోడ్..

పిల్లలకు గేమ్స్ లేదా వీడియోలు చూపించాలంటే ఫోన్‌లో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం మంచిది. ఇలా చేస్తే ఇంటర్నెట్ యాక్సెస్ పూర్తిగా నిలిచిపోతుంది కాబట్టి పిల్లలు ప్రమాదకరమైన వెబ్‌సైట్లను లేదా ఆన్‌లైన్ ప్రకటనలను చూసే అవకాశం ఉండదు.

నెట్‌వర్క్ రీసెట్‌..

కొన్నిసార్లు సిగ్నల్ పోయి తిరిగి రావడానికి ఆలస్యం అవుతుంది. అప్పుడు ఫ్లైట్ మోడ్‌ను 10 సెకన్లు ఆన్ చేసి తిరిగి ఆఫ్ చేస్తే, మొబైల్ నెట్‌వర్క్ ఆటోమేటిక్‌గా రీఫ్రెష్ అవుతుంది. దీని వలన సిగ్నల్ సమస్య త్వరగా పరిష్కారమవుతుంది.

నిద్ర..

నిద్ర సమయంలో కూడా ఫోన్ సిగ్నల్స్ మన మెదడుపై ప్రభావం చూపుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. అందువల్ల రాత్రిపూట ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి ఉంచితే రేడియేషన్ ఎమిషన్ తగ్గి, నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

ప్రకటనలు లేకుండా గేమ్స్ ఆడేందుకు..

ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఆన్‌లైన్ యాడ్స్ రావు. కాబట్టి ఫ్లైట్ మోడ్‌లో గేమ్స్ ఆడితే ఎటువంటి యాడ్ డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ గేమింగ్ అనుభవం పొందవచ్చు.

డేటా సేవింగ్ టెక్నిక్..

చాలామందికి తెలియదు కానీ ఫ్లైట్ మోడ్‌ను ఆన్ చేసి, తరువాత కేవలం Wi-Fi మాత్రమే ఆన్ చేస్తే, మొబైల్ డేటా పూర్తిగా సేవ్ అవుతుంది. ఇది డేటా ఖర్చు తగ్గించడంలో సహాయపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+