మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచిన ఎయిర్‌టెల్

Airtel recharge: ప్రైవేట్ టెలికం కంపెనీ ఎయిర్‌టెల్.. తన సబ్‌స్క్రైబర్లకు వాత పెట్టింది. మొబైల్ రీఛార్జ్ టారిఫ్ రేట్లను భారీగా పెంచింది. పెంచిన మొబైల్ రీఛార్జ్ టారిఫ్ రేట్లు జులై 3వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన విడుదల చేసిందా సంస్థ యాజమాన్యం. రిలయన్స్ జియో తరువాత ఆ స్థాయిలో టారిఫ్ రేట్లను పెంచిన సర్వీస ప్రొవైడర్ ఇదే. పోస్ట్ పెయిడ్‌ సైతం అమాంతం పెంచింది.

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్స్..

28 రోజుల 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ టారిఫ్ రేటు ప్రస్తుతం 179 రూపాయలు. తాజా పెంపుతో ఇది 199 రూపాయలకు చేరింది. 84 రోజుల అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్ ధర 455 రూపాయల నుంచి 509 రూపాయలకు పెరిగింది. 365 రోజుల అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్ రేటు ప్రస్తుతం 1,799 రూపాయలు ఉండగా.. ఇది 1,999 రూపాయలకు పెరిగింది.

Airtel announces revised mobile tariffs

28 రోజుల డెయిలీ డేటా ప్లాన్స్..

28 రోజుల 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ టారిఫ్ రేటు ప్రస్తుతం 265 రూపాయలు. తాజా పెంపుతో ఇది 299 రూపాయలకు చేరింది. 28 రోజుల 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ టారిఫ్ రేటు ప్రస్తుతం 299 రూపాయలు ఉండగా.. ఇది 349 రూపాయలకు చేరింది.

2.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ టారిఫ్ రేటు 359 రూపాయల నుంచి 409 రూపాయలకు, 399 రూపాయల 3 జీబీ డేటా అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్స్ ధర 449 రూపాయలకు పెరిగింది.

56 రోజుల 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధర 479 రూపాయల నుంచి 579 రూపాయలకు పెరిగింది. 56 రోజుల 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ ప్లాన్ రేటు 549 రూపాయల నుంచి 649 రూపాయలకు పెంచింది ఎయిర్‌టెల్.

84 రోజుల 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధర 719 రూపాయల నుంచి 859 రూపాయలు, 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ రేటు 839 రూపాయల నుంచి 979 రూపాయలకు పెరిగింది. 365 రోజుల 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్లాన్ ధర 2,999 నుంచి 3,599 రూపాయలకు పెరిగింది.

డేటా యాడ్ ఆన్ ప్లాన్స్..

డేటా యాడ్ ఆన్‌లో ఒక రోజుకు ఒక జీబీ డేటా ప్లాన్ ప్రస్తుతం 19 రూపాయలు ఉండగా..ఇది 22 రూపాయలకు పెరిగింది. ఒక రోజుకు 2 జీబీ డేటా ప్లాన్ ప్రస్తుతం 29 రూపాయలు ఉండగా..33 రూపాయలు, 4 జీబీ డేటా ప్లాన్ వాలిడిటీ 65 నుంచి 77 రూపాయలకు పెంచినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+