అసలేంటి "వైబ్ కోడింగ్".. నేర్చుకోవాలని మెటా ఏఐ సీఈఓ షాకింగ్ కామెంట్స్ ??
అలెగ్జాండర్ వాంగ్.. సాంకేతిక ప్రపంచంలో ఇటీవల మారుమోగుతున్న పేరు. కేవలం 19 ఏళ్ల వయసులో 'స్కేల్ ఏఐ’ అనే సంస్థను స్థాపించి.. 24 ఏళ్లకే బిలియనీర్‌గా ఎదిగి రికార్డు సృష్టించారు. లేటెస్ట్ గానే 28 ఏళ్ల వయసులో ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ 'మెటా ఏఐ’ సీఈఓ బాధ్యతలు చేపట్టడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు. టెక్ రంగంలో కొత్త తరానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈయన 'వైబ్ కోడింగ్’ గురించి చేసిన కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
యువతకు వాంగ్ సలహా..
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అలెగ్జాండర్ వాంగ్ టీనేజర్లకు విలువైన సలహా ఇచ్చారు. మీరు 13 ఏళ్ల వయసులో ఉన్నారంటే.. మీ సమయమంతా వైబ్ కోడింగ్ నేర్చుకోవడానికే వెచ్చించండని తెలిపారు. భవిష్యత్తు విజయానికి ఇది పునాది అవుతుందని సూచించారు. ఏఐ (AI) టూల్స్‌లో కనీసం 10,000 గంటలు కృషి చేస్తే భవిష్యత్ ఉద్యోగ మార్కెట్‌లో ముందుండే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. గతంలో బిల్ గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి వారు కంప్యూటర్లపై పనిచేసి ఎదిగినట్లే, ఇప్పుడు అదే స్థాయి విప్లవం ఏఐలో జరగబోతోందని పేర్కొన్నారు.

వైబ్ కోడింగ్ అంటే ఏమిటి..












Click it and Unblock the Notifications