సునీత రాకపై అయోమయం
Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇప్పట్లో తిరిగి వచ్చేల పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొన్ని నెలల పాటు ఆమె అక్కడే గడపడం ఖాయమైంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ.. నాసా అధికారికంగా వెల్లడించింది.
ఈ ఏడాది జూన్‌లో సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బ్యారీ బుచ్ విల్మోర్‌ను ఐఎస్ఎస్‌కు పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరినీ స్టార్‌లైనర్ స్పేస్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి పంపింది.

తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో థ్రస్టర్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సివచ్చింది. సునీతా విలియమ్స్, బారీ విల్మోర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకుని రాగలమని తాజాగా నాసా ప్రకటించింది.
జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సమస్యల తలెత్తాయి. అప్పటికే అది ఐఎస్ఎస్‌తో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూల్‌లో హీలియం లీక్‌తో పాటు 28 థ్రస్టర్లల్లో అయిదు పూర్తిగా పని చేయడం మానేశాయి. దీనితో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలో దిగింది బోయింగ్. ఆ పనులు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో- ఐఎస్ఎస్‌లో చిక్కుకుపోయిన సునీత విలయమ్స్, విల్మోర్‌ను భూమ్మీదికి తీసుకుని రావడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధక సంస్థ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకోనుంది. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ క్యాప్సుల్‌లో వారిని భూమికి తిరిగి తీసుకొస్తామని నాసా వెల్లడించింది.












Click it and Unblock the Notifications