అంతరిక్ష పరిశోధనలను మలుపు తిప్పేలా- మార్స్‌పై.. !!
Mars: అంతరిక్ష పరిశోధనల్లో సరికొత్త ఆవిష్కరణకు తెర తీసింది చైనా. అంగరాక గ్రహంపై నీటి జాడను గుర్తించింది. ఒకప్పుడు లోతైన సముద్రాలు, సువిశాల ఇసుక తిన్నెలు ఉండేవనే నిర్ధారణకు వచ్చింది. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్‌లో ఓ జర్నల్‌ను ప్రచురించింది.
చైనా రోవర్..
మార్స్‌పై పరిశోధనలను నిర్వహించడానికి ఝురాంగ్ అనే రోవర్‌ను పంపించింది చైనా. 2021లో ఇది అక్కడ ల్యాండ్ అయింది. అప్పటి నుంచీ రీసెర్చ్ కొనసాగిస్తోంది. తాజాగా నీటి జాడలను గుర్తించింది. ఒకప్పుడు అంగారక గ్రహం ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేది కాదని తేల్చి చెప్పింది. సముద్రాలు ఉండేవనడానికి అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించింది.

3.5 నుంచి 4 బిలియన్ సంవత్సాల కిందట..
నాలుగు బిలియన్ సంవత్సరాల కిందట- అచ్చంగా భూమిని పోలి ఉండే రాతి పొరలు, ఇసుక తిన్నెలు, సముద్రాలు ఉండేవని, డెల్టా ప్రాంతాల తరహా వాతావరణం అంగారక గ్రహంపై గుర్తించామని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ జియాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ బెంజమిన్ కార్డెనాస్ తెలిపారు. మార్స్‌పై గాలి.. దాని వల్ల సంభవించే అలలు, ఇసుక తిన్నెలకు కొరత ఉండేది కాదని చెప్పారు.
పరిశోధనలా సాగించిన వైనం..
తియాన్వెన్ 1 మిషన్‌లో భాగంగా మార్స్‌పై ఉటోపియా ప్లానీటియా ఏరియాలో ల్యాండ్ అయిన ఝురాంగ్ రోవర్.. ఉపరితలం నుంచి 260 అడుగుల అంటే దాదాపుగా 80 మీటర్ల మేర స్కాన్ చేసింది. దీనికి సంబంధించిన సమగ్ర డేటాను గ్రౌండ్ స్టేషన్‌కు పంపించింది. భూమిపై తీరప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఖనిజాలు, ఇసుక, మందంగా- వాలుగా ఉండే పొరలు బయటపడ్డాయి.
అలలు, ఆటుపోట్లు ఉంటేనే..
అలలు, ఆటుపోట్లు ఉంటేనే అలాంటి పొరలు, దానికి సంబంధించిన నిర్మాణాలు ఏర్పడతాయని బెంజమిన్ కార్డెనాస్ విశ్లేషించారు. భూమిపై తొలి జీవం వృద్ధి చెందినప్పుడు ఎలాంటి వాతావరనం ఉండేదో.. అలాంటి వాతావరణం 3.5-4 బిలియన్ సంవత్సరాల కిందట మార్స్‌పై ఉండేదని అన్నారు.
సూక్ష్మజీవుల ఉనికి..
అప్పట్లో సూక్ష్మజీవుల ఉనికి, అవి దీర్ఘకాలం పాటు జీవించి ఉండటానికి గల అనుకూల వాతావరణ పరిస్థితులను ఒకప్పుడు మార్స్‌పై ఉండేవనడానికి బలమైన సాక్ష్యాలు వెలుగులోకి వచ్చినట్టయిందని కార్డినెస్ చెప్పారు. మార్స్- ఒకప్పుడు నివాసయోగ్యంగా ఉండేదనే విషయాన్నీ కొట్టిపారేయలేమని చెప్పారు.
అన్ని ఆధారాలు..
భూమిపై తీర ప్రాంతాల్లో ఏ తరహాలో గాలుల తీవ్రత ఉంటుందో.. అలాంటి వాతావరణమే మార్స్‌పై ఉండేదని, బలమైన గాలులు వీచినప్పుడే అలలు ఉవ్వెత్తున ఎగుస్తాయని, ఇసుక తిన్నెలు ఏర్పడతాయని బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ ఎర్త్ అండ్ ప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ మైఖేల్ మాంగా తెలిపారు.
నదులు సైతం..
మార్స్‌పై కొన్ని సంవత్సరాల పాటు మంచు రహిత సముద్రం ఉండేదని, విభిన్నమైన అవశేషాలు కొట్టుకువచ్చాయనడానికి ఆధారాలు లభించాయని మైఖెల్ మాంగా చెప్పారు. నదులు విస్తారంగా ప్రవహించినప్పుడే ఇలాంటి వేర్వేరు ఖనిజాలు, ఇతర అవశేషాలు లభించగలవని పేర్కొన్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications