బుల్లెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధరలోనే!

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. జీఎస్టీ తగ్గింపు నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, బుల్లెట్ 350, క్లాసిక్ 350 మోడళ్ల ధరలు గణనీయంగా తగ్గాయి. ట్యాక్స్ స్లాబ్‌లలో వచ్చిన మార్పుల కారణంగా 3500 సీసీ వరకు ఉన్న బైక్‌‌లు ఇప్పుడు గతంలో కన్నా చాలా సరసమైన ధరల్లో లభిస్తున్నాయి. ఇది బైక్ మార్కెట్‌కు ఊపునిస్తుందని అంచనా.

ఐఫోన్ కంటే తక్కువ ధరలో రాయల్ ఎన్‌ఫీల్డ్
భారత్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,49,900 నుంచి రూ. 2,29,900 వరకు ఉంది. మరోవైపు జీఎస్టీ తగ్గింపు తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1,37,640 నుండి రూ.2,15,750 మధ్య ఉన్నాయి. ఆన్-రోడ్ ధరలలో రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులు ఉంటాయి. అయినప్పటికీ, హంటర్ 350, బుల్లెట్ 350, క్లాసిక్ 350 మోడళ్లలోని అనేక వేరియంట్లు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. కేవలం బుల్లెట్, క్లాసిక్ 350లోని కొన్ని టాప్-ఎండ్ మోడల్స్ మాత్రమే ఐఫోన్ హై-ఎండ్ వేరియంట్ ధరలకు దగ్గరగా ఉన్నాయి.

Good News for Bullet Lovers Royal Enfield Bikes Now Cheaper Than an iPhone 17 Pro Max

జీఎస్టీ సంస్కరణలతో ధరల మార్పులు
కొత్త జీఎస్టీ సంస్కరణల ప్రకారం.. 350 సీసీ వరకు ఉన్న బైక్‌లపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. ఈ మార్పు వల్ల రాయల్ ఎ‌న్‌ఫీల్డ్ 350 సీసీ బైకుల ధరలు సగటున 8.2 శాతం తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు నేరుగా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.

కొత్త ధరలు (సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి)
*రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350-రూ.1,37,640 - రూ.1,66,883(కొత్త ధర) - రూ.1,49,900 - రూ.1,81,750(పాత ధర)
*రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 - రూ.1,62,161 - రూ.2,02,409(కొత్త ధర)- రూ.1,76,625 - రూ.2,20,466(పాత ధర)
*రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350- రూ.1,81,118 - రూ.2,15,750(కొత్త ధర)- రూ.1,97,253 - రూ.2,34,972(పాత ధర)

ఇంజిన్, పనితీరు:
ఈ మూడు బైకులలో కంపెనీకి చెందిన జె-సిరీస్ ఇంజిన్ ను అమర్చారు. ఇది 349సీసీ, సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్. ఇది 20.2 బీహెచ్‌పీ శక్తిని, 27 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ జత చేశారు.

350సీసీ పైబడిన బైక్‌ల ధరల పరిస్థితి
350సీసీ వరకు ఉన్న బైక్‌ల ధరలు తగ్గినప్పటికీ, 350సీసీ కంటే పెద్ద ఇంజిన్ ఉన్న బైక్‌లపై జీఎస్టీని 40శాతానికి పెంచారు. గతంలో వీటిపై 28 శాతం జీఎస్టీ, 3 శాతం సెస్ కలిపి మొత్తం 31 శాతం పన్ను ఉండేది. దీనివల్ల పెద్ద బైక్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.

మార్కెట్, కస్టమర్లపై ప్రభావం
జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్పుల వల్ల రాబోయే నెలల్లో కంపెనీ అమ్మకాలు పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ఇండియా మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్‌కు ఓ కీలక సంకేతం. తక్కువ పన్నుల కారణంగా కొనుగోలుదారులకు ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+