జియో అభిమానులకు గుడ్‌న్యూస్..రూ. 10వేలకే 5జీ ఫోన్...
జియో అభిమానులకు రిలయన్స్ సంస్థ శుభవార్తను అందించింది. అతిత్వరలోనే రిలయన్స్ జియో పదివేల రూపాయలకే 5జీ ఫోన్ ను లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ ఈఏడాది చివరి నాటికి లాంచ్‌కానున్నట్లు తెలుస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ని విస్తృతం చేయడంలో భాగంగా రిలయన్స్ సంస్థ ఈ దిశగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది. జియోతో కలిసి క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ ను అభివృద్ధి చేయడంలో ముందుంది. ఇక, క్వాల్‌కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇక, ఈ విషయాన్ని స్పెయిన్ బార్సిలోనాలో జరిగిన వరల్డ్ మొబైల్ కాంగ్రెస్-2024లో వెల్లడించడం జరిగింది. ఇది కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 280కోట్ల మంది ప్రజలకు జియో, క్వాల్ కామ్ సేవలను అందుబాటులోకి తీసుకోచ్చే ఆలోచన ఉన్నారు. జస్ట్ పదివేల రూపాయలతో 5జీ సేవలను పొందొచ్చు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్లతో జీవితం సాగుతుంది. ప్రతిదీ మొబైల్‌తోనే మొదవులవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వినయోగదారుడికి సౌకర్థ్యం మేరకు రిలయన్స్ జియో సంస్థ ఇప్పటికే చాలా రకాల సేవలను అందించింది. ఇప్పుడు తాజాగా, మరొకోత్త సేవను అందుబాటులోకే తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ప్రతి సామాన్యుడు కొనేవిధంగా అతితక్కువ ధరకే రూ.పదివేలకే 5 జీ సేవలను కలిగిన మొబైల్‌లను లాంచ్ చేయనుంది.

ప్రపంచంలో ఉన్న 280 కోట్ల మంది ప్రజలకు ఈ 5జీ సేవలు : ఇక, ఈ 5జీ నెట్‌వర్క్‌ని దేశంలో విస్తృతం చేయడంలో భాగంగా రిలయన్స్ సంస్థ ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంతో కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 280 కోట్ల మంది ప్రజలకు ఈ 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జియో, క్వాల్ కామ్ తెలిపాయి. భారత మార్కెట్లోని మిలియన్ల మంది 2జీ వినియోగదారులకు నేరుగా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. 2జీ వినియోగదారులకు నేరుగా 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి కొత్త చిప్‌సెట్ సాయపడుతుందని క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రకటించారు.












Click it and Unblock the Notifications