లగ్జరీ కార్ల ప్రియులకు గుడ్‌న్యూస్!
Luxury Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గుడ్ న్యూస్. మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్, ల్యాండ్ రోవర్, ఆడీ వంటి లగ్జరీ కార్ల ధరలు త్వరలో తగ్గుతాయి. జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల తీసుకున్న నిర్ణయం ప్రకారం.. కొన్ని రకాల వాహనాలపై పన్ను రేటును తగ్గించింది. ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. లగ్జరీ కార్లపై పన్ను రేటు 45-50 శాతం నుండి 40 శాతానికి తగ్గుతుంది. ఈ పన్ను తగ్గింపు వల్ల లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.
జీఎస్టీలో ఎలాంటి మార్పులు జరిగాయి?
జీఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు పన్ను రేట్లను రెండు ప్రధాన స్లాబుల్లోకి (5%, 18%) మార్చింది. ఇంతకు ముందు ఉన్న 12 శాతం, 28 శాతం స్లాబ్‌లను తొలగించారు. అలాగే లగ్జరీ వస్తువుల కోసం కొత్తగా 40 శాతం స్లాబ్‌ను ప్రవేశపెట్టారు. గతంలో అన్ని పెట్రోల్-డీజిల్ కార్లపై 28 శాతం జీఎస్టీతో పాటు, మోడల్, ఇంజిన్ సామర్థ్యం ఆధారంగా 1 శాతం నుండి 22 శాతం వరకు కాంపెన్సేషన్ సెస్ ఉండేది. లగ్జరీ కార్ల విషయంలో ఈ సెస్ 17 శాతం నుండి 22 శాతం వరకు ఉండడం వల్ల మొత్తం పన్ను 45 శాతం నుండి 50 శాతం వరకు ఉండేది.

ధరలు ఎందుకు తగ్గుతాయి?
భారతదేశంలో లగ్జరీ కార్లపై ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే అధిక పన్నులు ఉండేవి. దీనివల్ల వాటి ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు సెప్టెంబర్ 22 నుండి అమలయ్యే కొత్త పన్ను విధానం ప్రకారం, లగ్జరీ కార్లపై గరిష్టంగా 40 శాతం మాత్రమే పన్ను విధించబడుతుంది. దీంతో, మొత్తం పన్ను 5-10 శాతం తగ్గుతుంది. ఈ మార్పు మెర్సిడెస్-బెంజ్, బీఎమ్‌డబ్ల్యూ, ఆడీ వంటి లగ్జరీ బ్రాండ్‌లకు, అలాగే వాటిని కొనుగోలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది.
పెరగనున్న లగ్జరీ కార్ల డిమాండ్
కొంత మంది లగ్జరీ కార్ డీలర్ల అభిప్రాయం ప్రకారు.. పన్ను తగ్గడం వల్ల వాహనాల డిమాండ్ పెరుకుతుంది. అలాగే లగ్జరీ కార్లను మొదటిసారి కొనేవారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయినుప్పటికీ.. లగ్జరీ కార్ల వాటా కేవలం ఒక శాతం మాత్రమే. ఒక లగ్జరీ కార్ బ్రాండ్ అధికారి మాట్లాడుతూ.. భారత్‌లో లగ్జరీ కార్ల వాటా కనీసం 3 శాతం ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త జీఎస్టీ రేట్ల వల్ల లగ్జరీ కార్ల మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారుతుందని.. ఇది కొనుగోలుదారులకు, కంపెనీలకు ఇద్దరికీ మేలు చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications