Tech News: అక్కడ ఉద్యోగులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు.. వాట్సప్, గూగుల్ డ్రైవ్ వినియోగంపై నిషేధం
Hong Kong: ఈరోజుల్లో టెక్నాలజీకి ఉన్న ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్స్యూమర్ గూడ్స్ తయారీతో ప్రారంభమైన సాంకేతికత అంచెలంచెలుగా ఎదుగుతూ కొత్త పుంతలు తొక్కింది. గూగుల్ వంటి టెక్ సంస్థల సేవలు ఒక్కరోజు అందకపోయినా ప్రపంచం స్తంభించి పోతుందేమో అనేంతగా మానవజాతిని తన గుప్పెట్లో పెట్టుకుంది. అయితే సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న తరుణంలో కొన్ని సేవలు మరియు యాప్‌ల వినియోగాన్ని నిలిపివేయాల్సి వస్తోంది.
తాజాగా హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సివిల్ సర్వెంట్స్ తమ వర్క్ కంప్యూటర్‌లలో వాట్సాప్ , వీచాట్ మరియు గూగుల్ డ్రైవ్ వంటి పలు యాప్‌లను ఉపయోగించకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసింది. భద్రతాపరమైన సమస్యలే ఇందుకు కారణమని ప్రకటించింది. తమకు కలిగిన అసౌకర్యం గురించి పలువురు ఉద్యోగులు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లో వ్యక్తిగత పరికరాల ద్వారా సేవలను ఉపయోగించడానికి అనుమతించబడతారని అధికారులు తెలిపారు. మేనేజర్ ఆమోదంతో నిషేధానికి మినహాయింపులను పొందవచ్చని సూచించారు.

పెరుగుతున్న డేటా లీక్‌లు మరియు సైబర్ సెక్యూరిటీ సవాళ్ల కారణంగా పలు కార్పొరేట్ కంపెనీలు కూడా ఇలాంటి విధానాలనే అవలంబిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. హ్యాకింగ్ మరింత తీవ్రమైన సమస్యగా మారుతున్నందున నిషేధం అవసరమని హాంకాంగ్ ఇన్నోవేషన్, టెక్నాలజీ మరియు పరిశ్రమల కార్యదర్శి సన్ డాంగ్ వెల్లడించారు. అమెరికా, చైనా ప్రభుత్వాలు కూడా తమ అంతర్గత కంప్యూటర్ వ్యవస్థల కోసం కఠిన చర్యలు తీసుకున్నాయని గుర్తుచేశారు.
ఎన్‌క్రిప్టెడ్ సందేశాల ద్వారా భద్రతా చర్యలను దాటవేయకుండా హానికరమైన లింక్‌లు మరియు జోడింపులను నిరోధించడం ఈ పాలసీ లక్ష్యం అని ఫేస్‌బుక్ పోస్ట్‌లో ప్రభుత్వం వెల్లడించింది. ఇటీవల హాంకాంగ్ కు చెందిన వివిధ ప్రభుత్వ విభాగాల్లో డేటా ఉల్లంఘనలతో పాటు కనీసం 10 వేల మంది వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడంపై ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ తరహా పరిస్థితులకు చెక్ పెట్టేందుకు హాంకాంగ్ ఈ విధంగా నిర్ణయం తీసుకుని ఉండవచ్చని IT నిపుణులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications