భారత్ అణు శక్తికి కొత్త రెక్కలు.. అగ్ని-5 ప్రయోగం సక్సెస్ !

భారతదేశం రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడంలో మరో ముందడుగు వేసింది. ఈ మేరకు అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన కొద్ది నెలల్లోనే ఈ ప్రయోగం చేపట్టడం గమనార్హం. ఒడిశా లోని చాందీపూర్‌లో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు.

స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో క్షిపణి ప్రయోగం విజయవంతం అయినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. దీనివల్ల దేశం యొక్క అణు నిరోధక సామర్థ్యం మరింత బలపడినట్లుగా నిపుణులు అభిప్రాయపడ్డారు.

india-successfully-test-firing-the-agni-5-missile

అగ్ని-5 ప్రత్యేకతలు..

  • మధ్య-శ్రేణి బాలిస్టిక్ క్షిపణి (IRBM).
  • గరిష్ట పరిధి: 5,000 కి.మీ.
  • మూడు దశల ఘన ఇంధన ఇంజిన్ సాంకేతికత
  • మొబైల్ లాంచర్‌ల నుండి కూడా ప్రయోగించే అవకాశం
  • అధునాతన నావిగేషన్, మార్గదర్శక వ్యవస్థలు ఉండటంతో అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరేలా డిజైన్
  • అణు వార్‌హెడ్‌లను మోయగల సామర్థ్యం

అంతే కాకుండా ఈ క్షిపణిని మరింత ప్రత్యేకంగా నిలిపే అంశం కూడా ఉంది. ఇందులో మల్టీపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సాంకేతికత అని తీసుకువచ్చారు. ఈ కారణం వల్ల ఒకే క్షిపణి సాయంతో అనేక వార్‌హెడ్‌లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు.

అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడం వల్ల భారతదేశం.. చైనా, పాకిస్తాన్ సహా వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతాలను నిరోధ పరిధిలోకి తెచ్చింది. ఇది భారతదేశానికి రెండవ దాడి సామర్థ్యం (Second Strike Capability) కల్పించే దిశగా మరో అడుగుగా పరిగణించబడుతోంది. ఇది భారత్‌ను కేవలం దక్షిణాసియాలోనే కాదు, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఒక ప్రధాన అణ్వాయుధ శక్తిగా నిలబెడుతోంది. దీనివల్ల ప్రాంతీయ భద్రతా సమీకరణాలు మారే అవకాశం ఉందని రక్షణ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారతదేశం ఇప్పటికే అగ్ని-1 నుండి అగ్ని-4 వరకు క్షిపణులను మోహరించింది. వీటి పరిధి 700 కి.మీ. నుండి 3,500 కి.మీ. వరకు ఉంది.

  • అగ్ని-1: 700-900 కి.మీ. పరిధి, 1,000 కిలోల పేలోడ్ సామర్థ్యం. (ఇదే అగ్ని-1ను 2025 జులైలో పరీక్షించారు.)
  • అగ్ని-2: 2,000 కి.మీ. పరిధి.
  • అగ్ని-3: 3,000 కి.మీ. పరిధి.
  • అగ్ని-4: 3,500 కి.మీ. పరిధి.

ఇవన్నీ ఇప్పటికే వ్యూహాత్మక దళాలలో ప్రవేశపెట్టబడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+