wow: కుంభమేళా స్పేస్ వ్యూ చిత్రాలు చూశారా ..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగతున్న మహా కుంభమేళాకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుంది. జనవరి 13 నుంచి ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక క్రతువు ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. అయితే ఈ కుంభమేళాకు సంబంధించిన చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. ఈ చిత్రాలను అడ్వాన్సెడ్ వెర్షన్ అయిన స్పేస్ రాకెట్ రిశాట్- 1ఏ తీసింది. అత్యాధునిక రేడార్ టెక్నాలజీతో ఈ రాకెట్ ను రూపొందించింది ఇస్రో. ఈ రాకెట్ ను హైదరాబాద్ లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఎస్ఆర్సీ) పర్యవేక్షిస్తోంది. ఇస్రో రాడార్ తీసిన చిత్రాల్లో కుంభమేళా క్రతువుతోపాటు ప్రయాగ్ రాజ్ లోని రోడ్లు, భవనాలు, నదులపై ఉన్న బ్రిడ్జ్ లనూ అంతరిక్షం నుంచి చిత్రీకరించింది.
ఇస్రో చిత్రాల ఆధారంగా పటిష్ట భద్రత
క్లౌడ్ కవర్ ఉన్నా కూడా ఇస్రో రాడార్ కచ్చితత్వంతో చిత్రాలను తీసినట్లు ఎన్ ఎస్ ఆర్సీ విభాగం డైరెక్టర్ డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ తెలిపారు. ఈ చిత్రాలను ఉపయోగించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళాలోని భక్తుల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాటతోపాటు ఎలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్పేస్ రాకెట్ రిశాట్- 1ఏ.. కుంభమేళా ప్రారంభం కాకముందు ఏప్రిల్ 4, 2024లో, డిసెంబర్ 22, 2024లో మళ్లీ కుంభమేళా ప్రారంభమయ్యాక జనవరి 10, 2025న తీసినట్లు ఇస్రో స్పష్టం చేసింది.

సైన్స్, ఆధ్యాత్మికత మేళవింపుతో..
అధునాతన టెక్నాలజీని ఆధారంగా చేసుకుని కుంభమేళా లాంటి ఆధ్యాత్మిక క్రతువులను పకడ్బందీగా నిర్వహించవచ్చని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత చేపట్టవచ్చని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్ పేర్కొన్నారు. టెక్నాలజీ, ఆధ్యాత్మికత మేళవింపుతో ప్రజలకు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించవచ్చని తెలిపారు.

ఇక కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఒక్క సంక్రాంతి రోజే కోటీ 60లక్షల మంది పవిత్రసంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. రానున్న రెండు నెలల్లో కోట్ల మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications