మీ పీసీ, ల్యాప్ టాప్ ఇలా కనిపిస్తోందా- బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్
Windows: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సర్వీసులు స్తంభించిపోయాయి. గ్లోబల్ అవుటేజ్ ఏర్పడింది. ప్రత్యేకించి మైక్రోసాఫ్ట్ విండోస్, ల్యాప్‌టాప్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియా, అమెరికా సహా అనేక దేశాల్లో విండోస్ 10 సాఫ్ట్‌వేర్ మొత్తం క్రాష్ అయింది. ఉన్నట్టుండి కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ పని చేయడం మానేశాయి.
పర్సనల్ కంప్యూటర్‌లో సమస్యలు తలెత్తాయని, రీస్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందంటూ బ్లూ స్క్రీన్ మెసేజ్ ప్రత్యక్షం కావడం వినియోగదారులకు కలవరపాటుకు గురి చేసింది. రీస్టార్ట్ చేసినా మళ్లీ మళ్లీ అదే స్క్రీన్ కనిపించడం యూజర్లు ఆందోళనకు గురయ్యారు. చాలామంది యూజర్లు తమ బ్లూ స్క్రీన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దీనితో #Windows అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. కొత్త క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ కారణంగా ఈ సమస్య తలెత్తింది. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ అసంపూర్తిగా లోడ్ కావడం, విండోస్ 10 సాఫ్ట్‌వేర్ దీనికి సపోర్ట్ చేయకపోవడం, అన్-ఇన్‌స్టాల్ మెసేజీలు రావడం వంటి కారణాల వల్ల బ్లూ స్క్రీన్ ప్రత్యక్షమౌతున్నట్లు అంచనా వేస్తోన్నారు.
దీని ప్రభావం వల్ల పలు దేశాల్లో బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయాయి. ఆన్‌లైన్ ఫ్లైట్ బుకింగ్ వంటి కార్యకలాపాలపై దీని ప్రభావం పడింది. సూపర్ మార్కెట్లల్లో బిల్లింగ్ నిలిచిపోయింది. దీనికి బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ అంటూ పేరు పెట్టారు నెటిజన్లు. చివరికి అమెరికాలోని కొన్ని మీడియా హౌస్‌లు కూడా ఈ సమస్య వల్ల ఇబ్బందులు పడ్డాయి.
సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్యల వల్ల బుకింగ్, చెక్-ఇన్ సహా ఆన్‌లైన్ సేవలు కొన్ని తాత్కాలికంగా అందుబాటులో ఉండట్లేదని భారత్‌కు చెందిన ఆకాశ ఎయిర్‌వేస్ వెల్లడించింది. విమానాశ్రయాల్లో మాన్యువల్ చెక్-ఇన్, బోర్డింగ్ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించింది.
ఆకాశ ఫ్లైట్‌లల్లో టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు చెక్-ఇన్ కోసం నిర్దేశిత గడువు కంటే ముందే ఎయిర్ పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుందని ఆ సంస్థ వివరించింది. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకన్న వారి రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్‌కు సమాచారం ఇచ్చింది.












Click it and Unblock the Notifications