Mobile Network: తెలుగు రాష్ట్రాల్లో దుమ్మురేపుతున్న నెట్ వర్క్ ఇదే

మీరు ఏ సిమ్ వాడుతున్నారు అని ఎవరినైనా అడిగితే ఫలానా కంపెనీ పేరు చేప్తారు. ఎందుకు ఆ నెట్ వర్క్ తీసుకున్నారు అంటే.. మా ప్రాంతంలో ఇదే సిగ్నల్ బాగా వస్తుందని కూడా కారణం చెప్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని నెట్ వర్క్లు బాగా పనిచేస్తాయి. జియో, ఎయిర్‌టెల్ వెళ్లలేని కొండ ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ ఏ దిక్కుగా ఉంది. అక్కడ ఫోన్ మాట్లాడటానికి సిగ్నల్ వస్తే చాలులే అనే స్టేజ్ లో ఉంటారు ప్రజలు.. కానీ అమెరికా, చైనా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో 5G ఆధారిత డిజిటల్ జీవితం ఇప్పటికే సాధారణమైపోయింది. రోజుకు భారీగా గిగాబైట్ల డేటా వినియోగం అక్కడ కొత్త విషయం కాదు.

ఇప్పుడే అదే ట్రెండ్ భారత్‌లోనూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేగంగా కనిపిస్తోంది. ఒకప్పుడు నెలకు 1GB డేటా వాడితేనే ఎక్కువ అనిపించేది. ఇప్పుడు మాత్రం రోజుకు 2GB కూడా చాలడం లేదు. ఇది కేవలం అలవాటు మార్పు కాదు... డిజిటల్ జీవనశైలిలో వచ్చిన విప్లవం. మరి ఇంత మార్పును చూసి ప్రజానీకం ఎక్కువ ఏ కంపెనీని ఆదరిస్తున్నారో చూద్దాం.

Jio 5G Sparks Data Explosion in Andhra Pradesh amp amp Telangana Matching Global Digital Trends

టాప్ లో జియో..

అంతర్జాతీయ టెలికాం రిపోర్టుల ప్రకారం, 5G విస్తరణ పెరిగిన దేశాల్లో డేటా వినియోగం ప్రతి ఏడాది 25-30% వరకు పెరుగుతోంది. భారత్ కూడా ఇప్పుడు అదే బాటలో ఉంది. 2025 సెప్టెంబర్ త్రైమాసికానికి జియో వినియోగదారుల సగటు డేటా వినియోగం నెలకు 38.7GBకి చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఇది 31GB మాత్రమే. అంటే ఒక్క ఏడాదిలోనే భారీ జంప్. ఇతర టెలికాం నెట్‌వర్క్‌ల యూజర్లు నెలకు 15-28GB మధ్యే వాడుతుంటే, జియో యూజర్లు మాత్రం రోజుకు 1GBకి పైగా డేటాను ఖర్చు చేస్తున్నారు.

3 కోట్ల 18 లక్షల మంది యూజర్లు..

టెక్నాలజీ పరంగా వేగంగా మారుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నాయి. ట్రాయ్ (TRAI) గణాంకాల ప్రకారం, 2025 నవంబర్ నెలలోనే జియో ఈ రెండు రాష్ట్రాల్లో 1.17 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుంది. దీంతో మొత్తం యూజర్ల సంఖ్య 3.18 కోట్లకు చేరింది. ఐటీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఆన్‌లైన్ విద్య, రిమోట్ వర్క్ సంస్కృతి... ఇవన్నీ డేటా వినియోగాన్ని విపరీతంగా పెంచుతున్నాయి.

ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌లో జరుగుతున్న మొత్తం డేటా ట్రాఫిక్‌లో 45% కేవలం 5G ద్వారానే జరుగుతోంది. ఇది భారత్ డిజిటల్ ఎకానమీ వైపు ఎంత వేగంగా ప్రయాణిస్తున్నదో సూచిస్తోంది. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో డిజిటల్ ఏపీ - డిజిటల్ తెలంగాణ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ వేగం చూస్తుంటే... భవిష్యత్తులో రోజుకు 2GB కాదు, 3GB కూడా తక్కువే అనిపించే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి!

మిగతా నెట్ వర్క్ లతో పోల్చితే Jio AirFiber సేవలతో గ్రామాల్లో కూడా భారీగా విస్తరించాయి. దీని ద్వారా 4K వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ క్లాసులు, క్లౌడ్ గేమింగ్, వీడియో కాన్ఫరెన్సులు, సాధారణంగా మారిపోయాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ నెలకు వందల గిగాబైట్ల డేటా వినియోగం నమోదవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+