సప్త గ్రహాలు ఒకే రేఖపై..గెట్ రెడీ
Planetary Parade: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోందీ సాయంత్రం. సప్తగ్రహ కూటమి కనువిందు చేయబోతోంది. ఏడు గ్రహాలు సమాంతర రేఖపై కనిపించనున్నాయి. ఇలాంటి అవకాశం రావడం అత్యంత అరుదు. మళ్లీ 15 సంవత్సరాల తరువాత అంటే 2040లోనే ఇలాంటి సప్తగ్రహ కూటమి ఏర్పడుతుంది.
కొన్ని రోజులుగా ఆరు గ్రహాలు ఆంబరాన సందడి చేస్తూ వస్తోన్నాయి. శుక్రుడు (వీనస్), కుజుడు (మార్స్), గురు (జుపిటర్), శని, యురేనస్, నెప్ట్యూన్ ఇప్పటికే తరచూ పలకరిస్తోన్నాయి. తాజాగా బుధ గ్రహం (మెర్క్యురి) కూడా వీటితో జతకట్టనుంది. బుధగ్రహం ఒకే వరసలోకి రావడం ఇదే తొలిసారి.

సప్తగ్రహాలు కూటమి కట్టడం ఈ నెల 28వ తేదీన ఆరంభమౌతుంది. మార్చి 7-8వ తేదీ వరకు కనువిందు చేస్తుంది. దీన్ని చూడటానికి మార్చి 3వ తేదీ రాత్రి బెస్ట్ విజిబుల్ అండ్ అక్యురెట్ టైమ్‌గా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. సప్తగ్రహాలు కూటమి కట్టడం అనేది మళ్లీ 2040లోనే చోటు చేసుకుంటుంది. చివరిసారిగా 1982లో ఆయా గ్రహాలన్నీ కూడా ఒకే రేఖపై కనిపించాయి.
సూర్యుడు అస్తమించిన 45 నిమిషాల తరువాత ప్లానెటరీ పరేడ్ విస్పష్టంగా కనిపిస్తుంది. ఎలాంటి స్పేస్ టెలిస్కోప్‌లు, బైనాక్యులర్లు లేకుండా వీనస్, మార్స్, జుపిటర్, యురేనస్ ప్లానెట్లను నేరుగా చూడొచ్చు. శని, మెర్క్యురి, నెప్ట్యూన్‌ను చూడటానికి అవి అవసరమౌతాయి. భారత్‌లో ఏ మూల నుంచి చూసినా ఈ సప్తగ్రహాల సమూహాన్ని వీక్షించవచ్చని ప్లానెటరీ సొసైటీ తెలిపింది.
స్టార్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన 27 ఏళ్ల స్పేస్ ఫొటోగ్రాఫర్ జోష్ డ్యూరీ.. ఈ ఆరు గ్రహాలనూ ఒకే ఫ్రేమ్‌లో క్లిక్ చేయగలిగాడు. గ్రేట్ ప్లానెటరీ పరేడ్‌గా దీనికి పేరు పెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫిబ్రవరి 22వ తేదీన సోమర్‌సెట్‌లోని మెండిప్ హిల్స్ నుండి ఈ ఫొటోలను తీశారు.
సాధారణ కంటికి కనిపించని బుధుడు, శని, నెప్ట్యూన్ గ్రహాల ఫొటోలు తీయడానికి కొత్త టెక్నిక్‌ను ఉపయోగించారు. డ్యూయల్-ఎక్స్‌పోజర్ విధానాన్ని అనుసరించారు. క్రాస్-రిఫరెన్స్ చేశాడు. సిగ్మా 15 ఎంఎం డయాగోనల్ ఫిష్ఐ లెన్స్ కలిగిన సోనీ ఏ7ఎస్ కెమెరాను వినియోగించినట్లు డ్యూరీ తెలిపారు.












Click it and Unblock the Notifications