Nobel Prize 2024 in Medicine: మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కర్తలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. ఒక్కో రోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన ఉండబోతోంది.
ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర కొద్దిసేపటి కిందటే ప్రారంభమైంది. అద్భుతాలను ఆవిష్కరించిన అమెరికాకు చెందిన బయాలజిస్ట్ విక్టర్ ఆర్ ఆంబ్రోస్, మాలిక్యులర్ బయాలజిస్ట్ గ్యారీ బ్రూస్ రువ్‌కున్‌కు మెడిసిన్‌లో నోబెల్ బహుమతి వరించింది.

వారిద్దరినీ మెడిసిన్‌లో నోబెల్ ప్రైజ్ కోసం వారిద్దరినీ ఎంపిక చేసింది నోబెల్ జ్యూరీ కమిటీ. ఈ మేరకు నోబెల్ కమిటీ కార్యదర్శి వారి పేర్లను ప్రకటించారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన సమావేశం సందర్భంగా ఈ ప్రకటన చేశారు. మైక్రో బయాలజీ, రీబౌనోక్లిక్ యాసిడ్ నిర్మాణంపై పరిశోధనలు చేశారని, దానికి గుర్తుగా ఈ అవార్డు కోసం వారి పేర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.
ప్రస్తుతం విక్టర్ ఆంబ్రోస్ అమెరికా యూనివర్శిటీ ఆఫ్ మస్సాచుసెట్స్‌కు చెందిన వార్సెస్టర్ మెడికల్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. గ్యారీ రువ్‌కున్.. మస్సాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో మాలిక్యులర్ బయాలజిస్ట్‌గా, బోస్టన్‌లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 7, 2024
The 2024 #NobelPrize in Physiology or Medicine has been awarded to Victor Ambros and Gary Ruvkun for the discovery of microRNA and its role in post-transcriptional gene regulation. pic.twitter.com/rg3iuN6pgY












Click it and Unblock the Notifications