Smart Nails : మీ డ్రస్సింగ్‌కు తగ్గట్టు సెకన్లలో రంగు మార్చేసే "స్మార్ట్ గోళ్లు"..

ఫ్యాషన్ ప్రపంచం నిరంతరం కొత్త టెక్నాలజీలతో రూపుదిద్దుకుంటోంది. గతంలో గోళ్లకు నెయిల్ పాలిష్ వేసి, అది ఆరే వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ శ్రమ లేకుండానే 'స్మార్ట్ నెయిల్స్' మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని గోళ్లకు అతికించుకుని, మొబైల్ ఫోన్ ద్వారా కొన్ని సెకన్లలోనే రంగు మార్చుకోవచ్చు. సుమారు రూ.8,500 ధరతో లభించే ఇవి, గోళ్ల రంగును త్వరగా మార్చాలనుకునే వారికి సరైన ఎంపిక.

ఈ స్మార్ట్ నెయిల్స్ పనితీరు ఆసక్తికరం. సాధారణ నకిలీ గోళ్లలాగే కనిపించినా, వీటి లోపల ప్రత్యేక సాంకేతికత ఉంటుంది. మొబైల్ యాప్‌కి అనుసంధానమైన ఈ గోళ్లు, ఎంపిక చేసుకున్న రంగులోకి తక్షణమే మారిపోతాయి. 'మ్యాజిక్ వాండ్' అనే చిన్న పరికరంతో గోళ్లపై తాకగానే రంగు మారుతుంది. ఒక్కో గోరుకు కేవలం 5 సెకన్లు పడుతుంది, మొత్తం గోళ్లను క్షణాల్లోనే కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు. పార్టీలు, ఫంక్షన్లు, ఆఫీస్‌కు వెళ్లే ముందు త్వరగా సిద్ధపడాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

smart-nails-that-which-is-changing-colours-according-to-your-dress-with-in-seconds-and-complete-deta

ఈ స్మార్ట్ నెయిల్స్‌లో వినియోగించే ఎలక్ట్రోకెమికల్ లేదా నానోపాలిమర్ టెక్నాలజీ ప్రత్యేకమైనది. ఇది ఈ-ఇంక్ స్క్రీన్‌లా పనిచేస్తుంది; ఒక రంగును ఎంచుకుంటే, యాప్‌లో మళ్లీ ఎంపిక చేసే వరకు అది అలాగే నిలిచి ఉంటుంది. వందల సంఖ్యలో కలర్స్ అందుబాటులో ఉండగా, నివేదికల ప్రకారం 300 నుండి 400 వరకు షేడ్స్ ఎంచుకోవచ్చు. మీ డ్రెస్సుకు లేదా మూడ్‌కు తగ్గట్టుగా ఒకే రోజు పలుమార్లు గోళ్ల రంగును మార్చుకోవడం ఇప్పుడు సులువు.

ఈ స్మార్ట్ నెయిల్స్ సమయాన్ని ఆదా చేస్తాయి. నెయిల్ పాలిష్ ఆరే వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు, పాలిష్ చెడిపోవడం లేదా మచ్చలు వంటి సమస్యలు ఉండవు. అయితే, వీటిని తమ ఇష్టానుసారం కత్తిరించడం లేదా ఆకారం మార్చడం సాధ్యం కాదు. వీటి మన్నికపై కూడా ఇంకా స్పష్టత లేదు.

స్మార్ట్ నెయిల్స్ బ్యూటీ రంగంలో టెక్నాలజీ వేగాన్ని చాటుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ బ్యూటీ ఉత్పత్తులు ఖాయం. గోళ్లకు రంగు మార్చడం ఒకప్పుడు సమయం పట్టేది, ఇప్పుడు కొన్ని సెకన్ల వ్యవహారంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+