స్టార్‌షిప్ మిషన్ అబార్ట్- చివరి నిమిషంలో

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ 15 ప్రయోగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సూపర్‌ హెవీ వెయిట్ వీ3 రాకెట్ బూస్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం చివరి నిమిషంలో ఇది రద్దయింది. స్పేస్ షిప్ ను నింగిలోకి పంపిన తర్వాత బూస్టర్ వెనక్కి తిరిగి వస్తోన్న సమయంలో ఆటోమేటిక్ అబార్ట్ సిస్టమ్ ను స్పేస్ ఎక్స్ యాక్టివేట్ చేసింది. దీంతో.. ల్యాంచ్ ప్యాడ్ వైపు తిరిగి రావాల్సిన బూస్టర్‌ను సురక్షితంగా మెక్సికో సముద్ర తీరం వద్ద ల్యాండ్ అయింది.

మొదట టెక్సాస్‌లోని స్టార్‌బేస్ లాంచింగ్ సెంటర్ వద్ద ఈ బూస్టర్ ను ప్రయోగించింది స్పేస్ ఎక్స్. వ్యోమనౌకను నింగిలోకి పంపిన తర్వాత ఈ బూస్టర్ తిరిగి ఇదే లాంచ్ ప్యాడ్ కు చేరుకోవాల్సి ఉంది. దీనికోసం ప్రత్యేకంగా నిర్మించిన భారీ మెకానికల్ హ్యాండ్స్ చాప్‌ స్టిక్స్ సహాయంతో దీన్ని గాల్లోనే పట్టుకునేలా దీన్ని డిజైన్ చేసింది. అది సురక్షితంగా తిరిగి లాంచ్ ప్యాడ్ వద్దకు చేరివుంటే మిషన్ పూర్తయ్యేది గానీ అది సాధ్యపడలేదు.

SpaceX Super Heavy booster suffered a malfunction Starship Flight 15 triggering an automatic abort

రాకెట్ పైభాగం నుంచి బూస్టర్ వేరుపడిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. గాల్లో ఉండగానే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో.. లాంచ్ టవర్, ఇతర మౌలిక వసతులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉండటానికి అప్పటికప్పుడు దీన్నిఅబార్ట్ చేసింది స్పేస్ఎక్స్. టవర్ ల్యాండింగ్‌ను నిలిపివేసింది. దీంతో మంటల్లో చిక్కుకున్న ఈ సూపర్ హెవీ బూస్టర్ మెక్సికో సమీపంలో సముద్రంలో పడింది.

ఉన్నపళంగా అమెరికాలో స్తంభించిన వేలాది విమానాలు- ఎయిర్‌పోర్టుల్లో జనం గగ్గోలు
ఉన్నపళంగా అమెరికాలో స్తంభించిన వేలాది విమానాలు- ఎయిర్‌పోర్టుల్లో జనం గగ్గోలు

సూపర్ హెవీ రాకెట్ లో డిజైన్ లో నూతనంగా రూపొందించిన వీ3 వెర్షన్ బూస్టర్‌ను టవర్, మెకానికల్ చాప్ స్టిక్స్ సహాయంతో పట్టుకోవాలనేది స్పేస్‌ఎక్స్ ప్లాన్. ఇది మొదటి ప్రయోగం కావడం గమనార్హం. గతంలో పాత మోడల్ సూపర్‌హెవీ బూస్టర్‌లను ప్రయోగ వేదిక వద్ద విజయవంతంగా ల్యాండ్ చేసిన అనుభవం సంస్థకు ఉంది గానీ.. చాప్ స్టిక్స్ సహాయంతో గాల్లోనే పట్టుకునేలా ప్రయత్నానికి తెరతీయడం ఇదే మొదటిసారి.

ఈ ప్రక్రియ వల్ల సముద్రంలో రికవరీ ఆపరేషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉండదు. అలాగే.. ప్రయోగ కేంద్రం వద్దే రాకెట్ సురక్షితంగా లాంచ్ అయితే.. దాన్ని పునర్వినియోగ సమయం, వ్యయం గణనీయంగా తగ్గుతాయని స్పేస్ఎక్స్ చెబుతోంది. నింగిలోకి వెళ్లొచ్చిన రాకెట్ బూస్టర్‌ను తక్కువ సమయంలోనే తిరిగి ప్రయోగానికి సిద్ధం చేయడమే ఈ చాప్‌స్టిక్స్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగంలో ఎదురైన లోపాలను విశ్లేషించడం ద్వారా ల్యాండింగ్ వ్యవస్థలను మరింత పటిష్టం చేయడానికి స్పేస్‌ఎక్స్ చర్యలు తీసుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+