సెకెనుకు 1,400 కి.మీ వేగంతో భూమివైపు.. !!
సౌర వ్యవస్థలో సంభవించిన ఒక శక్తిమంతమైన విస్ఫోటనం భూమి దిశగా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో తీవ్రమైన జియోమాగ్నెటిక్ తుఫాను భూమిని తాకే అవకాశం ఉంది. దీనిపై నాసా దృష్టి పెట్టింది. ఎటువంటి విపత్తు సంభవిస్తుందనే విషయంపై ఆరా తీస్తోంది. ఈ పరిణామాల వల్ల భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో అరుదైన 'అరోరా బొరియాలిస్' కాంతులు కనిపించే అవకాశాలు లేకపోలేదు. ప్రత్యేకించి లఢక్ గగనతలంపై ఈ నార్తర్న్ లైట్స్ కనిపించవచ్చు.
ఈ నెల 6న సూర్యుడిపై సంభవించిన భారీ పేలుడు కారణంగా సౌర తుఫాన్ ఏర్పడింది. దీనికి జీ3గా ప్రకటించింది నాసా. అంటే.. అతి తీవ్ర సౌర తుఫాన్ అన్నమాట. సూర్యుడిపై అత్యంత చురుకైన 'యాక్టివ్ రీజియన్ 4461' నుంచి ఈ భారీ సౌర జ్వాల (M1.8 క్లాస్) చెలరేగింది. అత్యంత శక్తిమంతమైన సోలార్ ఫిలమెంట్ విస్ఫోటనం సంభవించినట్లు అంతరిక్ష నిపుణులు పేర్కొన్నారు. ఇది సెకనుకు దాదాపు 1,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. నేడు భూఅయస్కాంత క్షేత్రంతో ఢీకొనే అవకాశం ఉంది.

సూర్యుడి నుంచి వెలువడిన ఈ పదార్థంలో అతి దట్టమైన, గురుత్వాకర్షణ స్థాయి అత్యధికంగా ఉండే సోలార్ ఫిలమెంట్ ఉందని అమెరికాకు చెందిన స్పేస్ వెదర్ ప్రిడిక్షన్ సెంటర్ తెలిపింది. దీన్ని టెక్స్ట్‌బుక్ కోర్ ఫిలమెంట్ ఎరప్షన్ గా స్పేస్ వెదర్ నిపుణురాలు తమీథా స్కోవ్ అభివర్ణించారు. శాటిలైట్ డేటా ఆధారంగా దీని తీవ్రతను నిర్ధారించారు. ఆకర్షణీయమైన ఈ సౌర ధూళి వల్ల ఏర్పడే అరోరాలు, సాధారణం కంటే దక్షిణ ప్రాంతాల వరకు విస్తరించే అవకాశం ఉందని ఆమె సూచించారు.
సూర్యుడి నుంచి వెలువడే కణాలు, అయస్కాంత క్షేత్రాలు భూమిని చుట్టుముట్టే రక్షా కవచం (మాగ్నెటోస్పియర్)తో ఢీ కొన్నప్పుడు ఇటువంటి జియోమాగ్నెటిక్ తుఫానులు సంభవిస్తాయి. ఒకవేళ తుఫాను తీవ్రత పెరిగి, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే భారత్ లో కూడా కొన్ని ప్రాంతాల్లో అస్పష్టమైన అరోరా కాంతులను చూసే అదృష్టం కలగవచ్చు. లఢక్ దీనికి అనువైన ప్రదేశంగా గుర్తించారు. దీనిపై స్పష్టత రావాలంటే బీజెడ్ (Bz) అయస్కాంత క్షేత్రం దిశ కీలకం.
సౌర మేఘం నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రం దక్షిణ దిశ వైపు ఉంటేనే, అది భూమి అయస్కాంత క్షేత్రంతో సమర్థవంతంగా అనుసంధానమవుతుంది. అప్పుడే సౌర శక్తి వాతావరణంలోకి అధికంగా ప్రవేశించి, అరోరాల తీవ్రత పెరిగి అవి తక్కువ అక్షాంశాల వరకు విస్తరిస్తాయి. ఈ సౌర మేఘం భూమిని సమీపించే వరకు దానిలోని క్లిష్టమైన అయస్కాంత దిశను అంచనా వేయడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేశారు.
భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్లు దీనిని ముందుగానే పసిగడతాయి. ఫలితంగా తుఫాను ప్రభావం 15 నుంచి 60 నిమిషాల సమయం మాత్రమే కనిపిస్తుంది. ఆ సమయమప్పుడే బీజెడ్ ఫీల్డ్ దిశ ఆధారంగా, ఈ అయస్కాంత తుఫాను మధ్యస్థంగా ఉంటుందా లేదా విస్తృతమైన అరోరాలను సృష్టించేంత శక్తివంతంగా మారుతుందా అనేది నిర్ణయిస్తారు. దీని తీవ్రత, దిశ అనుకూలంగా ఉంటే భారత్ లో అరోరా లైట్స్ కనిపించవచ్చ.












Click it and Unblock the Notifications