వైజాగ్ పిచ్‌పై 20 రోజుల ప్రాక్టీస్.. ఆసీస్‌తో మ్యాచ్ విజయానికి కారణం

భారత మహిళల క్రికెట్ జట్టు 20 రోజుల పాటు ప్రాక్టీస్ చేసిందని.. ఆసీస్ తో మ్యాచ్ విజయానికి అదే కారణమని ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (కేశినేని చిన్ని) అన్నారు. ప్రస్తుతం దేశంలో మహిళలు ముందుకు వెళ్తున్నారని.. అలాగే దేశంలో పురుషుల క్రికెట్ ఎలాగైతే అభివృద్ధి చెందిందో అలాగే మహిళల క్రికెట్ కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. 7సార్లు ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో సునాయాసంగా ఓడించడమనేది.. మన మహిళా క్రికెటర్లకు ఉన్న సత్తా అంటూ కేశినేని చిన్ని కొనియాడారు.

దేశంలో మహిళలు ఎంతో ముందున్నారని.. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా ఎంతో మంది మహిళా కమాండర్లు పాల్గొన్నారని ఆయన తెలిపారు. మహిళా జట్టు సాధించిన విజయాన్ని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ కు అంకితం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయం పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా గర్వంగా ఉందన్నారు. 20 రోజులు మహిళల క్రికెట్ జట్టు వైజాగ్ లోనే ఉండి సన్నాహక మ్యాచ్ లకు సన్నద్ధం అయ్యారని ఆయన చెప్పారు. ఏసీఏ తరఫున చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళలు ఈ విధంగా విజయం సాధించడం దేశానికి గర్వకారణమన్నారు.

20 Days of Practice on Vizag Pitch Leads to Historic Win Against Australia Says Keshineni Chinni

భారత మహిళా జట్టు ఫైనల్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కేశినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాను ఓడించిన జట్టుకు దక్షిణాఫ్రికాను ఓడించడం అంత కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+