Ind-NZ ODI: 3 లక్షల వాటర్ ప్యూరిఫయర్ తెచ్చుకున్న భారత క్రికెటర్..!

భారత్-న్యూజీలాండ్ మధ్య వన్డే సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే చెరో మ్యాచ్ గెల్చుకున్న ఇరుజట్లూ రేపు ఇండోర్ లో జరిగే చివరిదైన మూడో మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత్, న్యూజీలాండ్ క్రికెటర్లు ఇండోర్ చేరుకున్నారు. అయితే ఓ భారత క్రికెటర్ మాత్రం తనతో పాటు 3 లక్షల రూపాయల విలువ చేసే వాటర్ ప్యూరిఫయర్ ను కూడా తెచ్చుకున్నాడట.

తాజాగా ఇండోర్ లో నీటి కాలుష్యం ఏర్పడి 23 మంది మృత్యువాత పడటం జాతీయ స్దాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల క్రికెటర్లకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందట. అయినా భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఇంకా ప్రత్యేకంగా 3 లక్షల రూపాయలు విలువ చేసే వాటర్ ప్యూరిఫయర్ ను తన కోసం ప్రత్యేకంగా తెచ్చుకున్నాడట. ఈ ప్యూరిఫయర్ ఆర్వో ట్రీట్ చేసి ప్యాక్ చేసిన బాటిల్ వాటర్ ను సైతం తిరిగి శుద్ధి చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా తయారు చేసింది కావడం విశేషం.

3 Lakh Purifier Shubman Gill s Extreme Precaution Amid Indore Crisis

ఈ విషయం అధికారికంగా బీసీసీఐ కానీ క్రికెటర్లు కానీ బయటికి చెప్పడం లేదు. కానీ టీమ్ బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది మాత్రం ఎన్డీటీవీకి ఈ విషయం వెల్లడించారు. ఈ చర్య ఇండోర్‌లో ఇటీవల కలుషిత నీటి వల్ల సంభవించిన మరణాలకు నేరుగా సంబంధం కలిగి ఉందా లేదా సాధారణ వ్యక్తిగత భద్రతా ప్రోటోకాల్‌లో భాగమా అనేది తెలియలేదు. హోటల్, స్టేడియంలో ప్యాక్ చేసిన సీసాలు మరియు ఆర్వో వ్యవస్థలతో సహా సురక్షితమైన తాగునీటి కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసినప్పటికీ .. భారత జట్టు ఈ అదనపు జాగ్రత్తను ఎంచుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+