ODI World Cup 2023: ఉప్పల్‍లో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్..
వన్డే వరల్డ్ కప్ 2023కి అంతా సిద్ధమైంది. శుక్రవారం నుంచి పలు జట్లు వార్మప్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో 5 మ్యాచులు జరగనుండగా.. అందులో రెండు వార్మప్ మ్యాచులు, మూడు ప్రధాన మ్యాచులు ఉన్నాయి. శుక్రవారం న్యూజిలాండ్ - పాకిస్తాన్ మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అక్టోబరు 3న ఆస్ట్రేలియా-పాకిస్తాన్ జట్ల మధ్య రెండో వార్మప్ మ్యాచ్ నిర్వహిస్తారు. అక్టోబరు 6న నెదర్లాండ్స్ - పాకిస్తాన్ మధ్య ప్రధానమైన మ్యాచ్ జరగనుంది.
అక్టోబర్ 9న న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మరో మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 10న శ్రీలంక-పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ మ్యాచులన్నీ డే అండ్ నైట్ మ్యాచులే. అంటే మధ్యాహ్నం 2 గంటలు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. వన్డే వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుంది. ప్రారంభం మ్యాచ్ అహ్మదాబాద్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. భారత్ తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరగనుంది. భారత్ అక్టోబర్ 14న దాయాది దేశం పాకిస్థాన్ లో అహ్మదాబాద్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత్, పాక్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

పాకిస్తాన్ జట్టు బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ బస చేస్తుంది. న్యూజిలాండ్ జట్టు ఐటీసీ కాకతీయలో ఉంటున్నారు. శ్రీలంక జట్టు శంషాబాద్ లోని నోవొటెల్ బస చేయనున్నారు. ఆస్ట్రేలియా జట్టు తాజ్ కృష్ణ బస చేయనుండగా.. నెదర్లాండ్స్ జట్టు కూడా తాజ్ కృష్ణలో బస చేయనుంది.గౌహతిలో బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ నంబర్ 19న జరగనుంది. గౌహతిలో శ్రీలంకతో బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్ లో తలబడనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతోంది.
పాకిస్థాన్ జట్టు ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది. బుధవారం రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఇండియాకు రావడం పై పాక్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఇస్టా లో పోస్ట్ చేశారు. ఇలా భారత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి సాదర స్వాగతం లభించడంతో పాక్ టీం చాలా ఎగ్జయిట్ అయినట్లు తెలుస్తోంది. తను హైదరాబాద్‌లో ఉన్నట్లు ఈ నగరాన్ని ట్యాగ్ చేశాడు. 'ఇప్పటి వరకు అద్భుతమైన స్వాగతం లభించింది' అని దీనికి క్యాప్షన్ ఇచ్చాడు.












Click it and Unblock the Notifications