గుండెపోటుతో మైదానంలోనే కుప్పకూలిన యువక్రికెటర్...
క్రికెట్ మైదానంలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ యువ క్రికెటర్ మైదానంలోనే కుప్పకూలాడు. గుండెపోటుతో మృతిచెందాడు. ఈ సంఘటన బెంగుళూరులో జరిగింది. ఇటీవలే కాలంలో గుండెపోటు మరణాలు సంఖ్య పెరుగుతూ ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అనేకమంది ప్రజలు గుండెపోటుకు గురవుతున్నారు. అంత వరకూ బానే ఉన్న వాళ్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలి తమ ప్రాణాలు వదులుతున్నారు. ఇలాంటి సంఘటనే ఇప్పడు బెంగుళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో చోటుచేసుకుంది.
బెంగళూరు వేదికగా జరుగుతోన్న ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్‌లో కర్ణాటక మాజీ క్రికెటర్ కే.హోయసల గుండెపోటుతో కన్నుమూశాడు. 34 ఏళ్ల వయసులోనే అతడు కన్నూమూయడంతో ఆ ప్రాంగణంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. 'ఏజిస్ సౌత్ జోన్ టోర్నమెంట్'లో భాగంగా బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ క్రికెట్ మైదానంలో తమిళనాడు, కర్ణాటక మధ్య మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తమిళనాడు, కర్ణాటక మధ్య జరగగా, కర్ణాటక టీమ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. గెలిచిన సంబరాల్లో ఆటగాళ్లు ఉండగా, అదే సమయంలో తీవ్రమైన ఛాతినోప్పినో హోయసల మైదానంలోనే కుప్పకూలాడు.

సంతాపం తెలుపుతున్నక్రికెటర్లు..అభిమానులు : హోయసల మైదానంలోనే కుప్పకూలడంతో వెంటనే వైద్య సిబ్బంది అతనికి అత్యవసర చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే హోయసల చికిత్సకు స్పందించలేదు. దాంతో వెంటనే అతనిని అంబులెన్స్‌లో బెంగళూరులోని బౌరింగ్ ఆస్పత్రికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్సపొందుతూ హోయసల కన్నుమూశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్, బౌలర్ అయిన హొయసల అండర్-25 విభాగంలో కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లోనూ హోయసల మంచి ప్రదర్శన కనబరచాడు. ఈ విషాద ఘటన ఈ నెల 22న జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాద సంఘటన గురించి తెలుసుకున్న పలువురు క్రికెటర్లు, అభిమానులు హోయసల మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications