టీమిండియాలో ఆ మాజీ లెజెండరీల కుమారులు ఎంట్రీ: ఆస్ట్రేలియాతో సిరీస్

ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో రాబోయే ద్వైపాక్షిక సిరీస్ కోసం బీసీసీఐ యువ జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీ వన్డే, మల్టీ-డే ఫార్మాట్లకు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. సెప్టెంబర్ 18వ తేదీన మొదటి వన్డే ఆరంభం కానుంది. రాజ్ కోట్ దీనికి వేదిక. అక్టోబర్ 5వ తేదీన రెండో మల్టీ- డే మ్యాచ్ తో ఈ సిరీస్ ముగుస్తుంది.

ఈ రెండు సిరీస్ లను ఆడే వేర్వేరు జట్లను బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. టీమిండియా మాజీ దిగ్గజాలు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రావిడ్‌లకు వన్డే జట్టులో చోటు దక్కింది. క్రికెట్ లో నెక్స్ట్ జనరేషన్ ప్రాభవానికి తెర తీసినట్టయింది. సుదీర్ఘ కాలం పాటు టీమిండియాలో ఆడిన సెహ్వాగ్, ద్రావిడ్ వారసులు ఇద్దరూ ఒకేసారి అండర్ 19 జట్టుకు ఎంపిక కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Aaryavir Sehwag and Anvay Dravid Earn Place in India U-19 ODI Squad Announced vs Australia series

ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలోనే దూకుడుగా ఆడే ఆర్యవీర్ సెహ్వాగ్ ఇటీవల ముగిసిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున మెరుపులు మెరిపించాడు. అంతకుముందు కూచ్ బెహార్ ట్రోఫీ మ్యాచ్‌లో మేఘాలయపై 297 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన సత్తా చాటాడు. రాహుల్ ద్రావిడ్ కుమారుడు, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వయ్ ద్రావిడ్ ఈ ఏడాి జూలైలో శ్రీలంక పర్యటనలో 87 పరుగులతో రాణించాడు.

ఆస్ట్రేలియాతో జరిగే ఈ సిరీస్‌‌లో వన్డే ఫార్మాట్‌కు లక్ష్య రాయ్‌చందానీ కేప్టెన్ గా వ్యవహరించనున్నాడు. యశ్‌బర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. నాలుగు రోజుల మల్టీ డే మ్యాచ్‌లకు మాత్రం యశ్‌బర్ధన్ చౌహాన్ కెప్టెన్‌, లక్ష్య రాయ్‌చందానీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఆర్యవీర్, అన్వయ్ ఇద్దరినీ వన్డే జట్టు కోసమే ఎంపిక చేశారు. మల్టీ డే మ్యాచ్‌ల జట్టులో వీరికి చోటు లభించలేదు.

మొదటి వన్డే సెప్టెంబర్ 18వ తేదీన రాజ్‌కోట్ లో ఉదయం 9 గంటలకు ఆరంభమౌతుంది. అదే నెల 21, 23 తేదీల్లో మిగిలిన రెండు వన్డేలు కూడా రాజ్ కోట్ లోనే జరుగుతాయి. మల్టీ డే మ్యాచ్ 27న ప్రారంభమౌతుంది. రాజ్‌కోట్ స్టేడియమే దీనికి కూడా వేదిక. మ్యాచ్ సమయం మాత్రం మారుతుంది. ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది. రెండో మల్టీ డే మ్యాచ్ అక్టోబర్ 5 నుంచి 8వ తేదీ వరకు అహ్మదాబాద్ బీ గ్రౌండ్ లో జరుగుతుంది.

ఈ అండర్-19 వన్డే జట్టులో.. లక్ష్య రాయ్‌చందానీ (కెప్టెన్), యశ్‌బర్ధన్ చౌహాన్ (వైస్ కెప్టెన్), రజత్ బఘేల్ (వికెట్ కీపర్), ఆర్యవీర్ సెహ్వాగ్, వీకే వినీత్, కుశాగ్ర ఓజా, అర్జున్ రాజ్‌పుత్, మణాల్ చౌహాన్, అన్వయ్ ద్రావిడ్ (వికెట్ కీపర్), వీ యశస్వి, రోహిత్ యాదవ్, షావిన్ వినోద్, మోహిత్ ఉల్వా, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్ ఎంపికయ్యారు.

మల్టీ డే మ్యాచ్ లు ఆడే జట్టులో.. యశ్‌బర్ధన్ చౌహాన్ (కెప్టెన్), లక్ష్య రాయచందనీ (వైస్ కెప్టెన్), సాగర్ విర్క్, కుషాగ్రా ఓజా, మనల్ చౌహాన్, కుష్ పటేల్, మానవ్ కృష్ణ (వికెట్ కీపర్), అభిప్రాయ్ బిస్వాస్ (వికెట్ కీపర్), రోహిత్ యాదవ్, ఇషాన్ ఓమ్, అయాన్ అక్రమ్, ప్రణవ్ రాఘవేంద్ర, ప్రియాంషు సింగ్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ యాదవ్ ఎంపికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+