సన్‌రైజర్స్ లో ధురంధర్- ఒకే టికెట్ పై రెండు సినిమాలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19 ఎడిషన్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల పరంపర కొనసాగుతోంది. శనివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో దూసుకెళ్లింది. నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లను ఆడిన సన్ రైజర్స్ మూడింట్లో నెగ్గింది. మొత్తం ఆరు పాయింట్లు ఉన్నాయి ఈ జట్టు ఖాతాలో.

తొలుత బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై తడబడింది. నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై ఇన్నింగ్ లో మాథ్యూ షార్ట్ ఒక్కడే టాప్ స్కోరర్. 34 పరుగులు చేశాడు. టాప్ ఆర్డర్ లో ఆయుష్ మాత్రే మినహా ఏ ఒక్కరు కూడా వేగంగా పరుగులు చేయలేకపోయారు. మాత్రే మాత్రమే 13 బంతుల్లో 30 పరుగులు బాదాడు. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, శివం దుబే వంటి బ్యాటర్లందరూ విఫలం అయ్యారు.

Abhishek Sharma 15-ball fifty and Heinrich Klaasen Half Century brings Sunrisers Hyderabad Win

సన్‌రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్ లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. 268. 18 స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. మరోవంక హెన్రిక్ క్లాసెన్ అర్ధ సెంచరీతో సత్తా చాటాడు. 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు. మినిమం గ్యారంటీతో పరుగులు రాబట్టుకుంటోన్నాడు క్లాసెన్. ఇప్పటికే తన ఖాతాలో ఉన్న ఆరెంజ్ క్యాప్ ను వదులుకోవట్లేదు. ఇద్దరు మినహా మరెవెరూ భారీగా పరుగులు చేయలేకపోయారు.

ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ లో కూడా విఫలం అయ్యాడు. 23 పరుగులు మాత్రమే చేశాడు. కేప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అనికేత్ వర్మ- 2, నితీష్ కుమార్ రెడ్డి- 12, సలీల్ అరోరా- 13, లియామ్ లివింగ్ స్టన్- 1, శివాంగ్ కుమార్- 12 పరుగులు చేశారు. 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వరుసగా వికెట్లు పడ్డాయి. పవర్‌ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోయింది.

నితీష్ రెడ్డి బౌలింగ్‌లో సంజూ శాంసన్ (7 పరుగులు) తొలి వికెట్‌గా వెనుతిరగగా, ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ కూడా పెవిలియన్ చేరారు. పవర్‌ప్లే ఆరు ఓవర్లలో చెన్నై మూడు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఆ తర్వాత మాథ్యూ షార్ట్, సర్ఫరాజ్ ఖాన్ క్రీజులో నిలదొక్కుకున్నారు గానీ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. మలింగ బౌలింగ్‌లో నితీష్ రెడ్డికి క్యాచ్ ఇచ్చి సర్ఫరాజ్ ఖాన్ ఔటయ్యాడు. ఆ వెంటనే బ్రెవిస్ కూడా శివాంగ్ కుమార్ చేతికి చిక్కాడు. దీంతో 11 ఓవర్లలో 112/5 పరుగులు చేసింది.

ఈ దశలో చెన్నైకి మాథ్యూ షార్ట్, శివమ్ దూబే కాస్త ఆశలు రేకెత్తించినా, కీలక సమయంలో మాథ్యూ షార్ట్ వెనుతిరిగాడు. చివరి ఓవర్లలో శివం దూబే వేగంగా పరుగులు చేయాలని ప్రయత్నించాడు గానీ సాధ్యపడలేదు. సన్‌రైజర్స్ బౌలింగ్ కట్టుదిట్టంగా సాగింది. శివం దూబేను సాకిబ్ హుస్సేన్ బౌల్డ్ చేయడంతో ఓటమి ఖాయమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+