డకౌట్ అయినా.. సంజూనే మా మొనగాడు!: మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న సంజూ శాంసన్.. మొదటి మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 10, 6, 0 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ముఖ్యంగా మూడో టీ20లో తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో అతడిని జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మాజీ కెప్టెన్ అజింక్యా రహానే ఏమన్నారంటే?
ఈ విమర్శల నేపథ్యంలో మాజీ టెస్ట్ కెప్టెన్ అజింక్య రహానే సంజూ శాంసన్‌కు మద్దతుగా నిలిచారు. 'క్రిక్‌బజ్'లో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో సంజూ పరుగులు చేయకపోయినా నేను అతడికే మద్దతు ఇస్తాను. అతడు క్వాలిటీ ప్లేయర్. టీ20 క్రికెట్‌లో ఒక్కోసారి ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి. మేనేజ్మెంట్, కెప్టెన్ అతడికి అండగా ఉండాలి. సంజూ సామర్థ్యం వేరు. అతడిని అభిషేక్ శర్మతో పోల్చకూడదు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన గొప్ప ఇన్నింగ్స్‌లను గుర్తు చేసుకుని, క్రీజులో కొంచెం సమయం గడిపితే సరిపోతుంది." అని రహానే అన్నాడు. తిలక్ వర్మ తిరిగి వచ్చినప్పుడు ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టి అయినా సంజూకే అవకాశం ఇవ్వాలని రహానే అభిప్రాయపడ్డారు.

హర్భజన్ సింగ్ హెచ్చరిక
మరోవైపు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా స్పందిస్తూ.. సంజూ శాంసన్‌కు మరికొన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే, "రన్స్ రాకపోతే మాత్రం ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపడం సహజంగానే జరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరగాలంటే పరుగులు చేయడం చాలా ముఖ్యం" అని భజ్జీ స్పష్టం చేశారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
గత 12 నెలలుగా టీ20 ఫార్మాట్‌లో సంజూ ప్రదర్శన గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. చివరి 3 ఇన్నింగ్స్‌లో 10, 6, 0లతో అభిమానులను నిరాశపరిచాడు. మరోవైపు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన పరిమిత అవకాశాల్లోనే మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతుండటం సంజూ స్థానానికి ఎసరు తెస్తోంది.టీమిండియా సిరీస్ గెలిచిన నేపథ్యంలో, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో సంజూ శాంసన్‌కు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇస్తుందో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications