IPL Mega Auction 2025:ఆటగాళ్ల ఆక్షన్‌లో కీలకంగా డేటా సైన్స్..ఇంట్రెస్టింగ్..!!

ఐపీఎల్ 2025 మెగా వేలంకు సర్వం సిద్ధమైంది. జెడ్డా సిటీ వేదికగా జరిగే వేలంపాట నవంబర్ 24,25వ తేదీల్లో జరుగుతుంది. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు నాల్గవ రోజు ఆట ముగిశాక ఓ అరగంట సమయంలో ఈ ఆక్షన్ జరుగుతుంది. భారతకాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలంపాట నిర్వహిస్తారు. ఇప్పటికే అన్ని ఫ్రాంఛైజీలు తమ స్ట్రాటజీస్‌తో సిద్ధంగా ఉన్నాయి. ఎన్నికల వేల ఎలాగైతే వ్యూహకర్తలు ఆయా రాజకీయ పార్టీలకు తెరవెనుక పనిచేస్తున్నారో ఈ ఐపీఎల్ 2025 మెగా వేలం వెనుక ఆయా ఫ్రాంఛైజీలు స్ట్రాటజిస్టులను అపాయింట్ చేసుకుని వారి ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఇంతకీ ఈ డేటా సైన్స్‌కు ఆక్షన్‌కు సంబంధం ఏంటి..?

ప్రస్తుతం ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ ఫీవర్ అంతటా కనిపిస్తోంది. ఇక ఫ్రాంఛైజీలు లేదా ఆయా జట్టు యాజమాన్యాలు మాత్రం ఎక్కువగా డేటా సైన్స్, ఆల్గారిథమ్స్,అనలిటిక్స్ పైనే ఆధారపడినట్లు తెలుస్తోంది. ఎక్కువగా వీరి మధ్య ఈ మూడు పదాలు వినిపిస్తున్నాయి. ఇక వేలంపాట జరగనున్న జెడ్డా నగరానికి ఆయా సంస్థలకు చెందిన డేటా అనలిస్టులను, నిపుణులను వీరితో పాటు తీసుకొచ్చారు.

ఐపీల్ వేలం 2025 LIVE: కాసుల వర్షం ఎవరిపై కురుస్తుంది..?

All Eyes on IPL Mega Auction 2025 Where Data Drives Big Deals

డేటా అనలిస్టులను హైర్ చేసుకున్న ఫ్రాంఛైజీలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌గా బ్రిటీష్ వ్యక్తి ఉండగా,ఈ ఫ్రాంఛైజీ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డుకు పనిచేస్తున్న అనలిటిక్స్ కంపెనీనీ హైర్ చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా ఇంగ్లాండ్‌కు చెందిన అనలిటిక్స్ టీమ్‌ను నియమించుకున్నట్లు సమాచారం.మరో ఫ్రాంఛైజీ అయితే సొంతంగా అనలిటిక్స్ నిపుణులను తయారు చేసుకుంది. వీరంతా ఆయా సంస్థలు/నిపుణులతో పలు దఫాలుగా సమావేశమై చివరిగా జెడ్డా నగరంలో అడుగుపెట్టారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా డేటా సైన్స్ ఆధారంగా వేలంపాటలో స్ట్రాటజీస్ అమలుచేసి ఆటగాళ్లను కొనుగోలు చేయడం నిజంగానే వర్కౌట్ అవుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటి వరకైతే వేలంపాటలన్నీ ఫ్రాంఛైజీల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఆటగాళ్లను కొనుగోలు చేసేవారు.అంతేకాదు వేలంపాట సందర్భంగా ప్రెస్టీజ్‌కు పోవడం, ఈగో దెబ్బతినకూడదని ఆటగాడిపై అనవసరంగా కొన్ని కోట్లు కుమ్మరించిన సందర్భాలున్నాయి. ఇలాంటిదే ఒక సందర్భం ఉంది.

ప్రెస్టీజ్‌కు పోయి...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువరాజ్‌సింగ్‌ను రిలీజ్ చేసింది.ఆయన రేటు రూ. 14 కోట్లుగా ఉన్నింది. అవతల ఫ్రాంఛైజీ పర్స్‌ను ఖాళీ చేయించేందుకు వ్యూహరచన చేశాడు విజయ్ మాల్యా.కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో తిరిగి రూ.15.5 కోట్లు వెచ్చించి యువరాజ్‌ను ఆర్సీబీనే కొనుగోలు చేయడం జరిగింది. మరో ఘటనలో చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇదే ట్రాప్‌లో పడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి పీయూష్ చావ్లాను రూ.4.2 కోట్లకు ట్రేడ్ చేసుకునేందుకు చెన్నైకి ఆఫర్ ఇవ్వగా.. అందుకు చెన్నై యాజమాన్యం తిరస్కరించిది. కానీ వేలంపాటలో పీయూష్ పై 6.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. పీయూష్ చావ్లాపై ధోనికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండటంతో రాజీ పడక తప్పలేదని ఆ జట్టు యాజమాన్యం చెప్పుకొచ్చింది.

All Eyes on IPL Mega Auction 2025 Where Data Drives Big Deals

రూ.43 కోట్లు బెంచ్‌మార్క్ దాటుతుందా..?

చివరిగా ఈ రోజు రేపు జరగబోయే ఆక్షన్‌లో ఐపీఎల్ ఫ్రాంఛైజీ జట్లు ఆటగాళ్లపై ఎంత కుమ్మరించనున్నాయి అనే అంశం ప్రధాన చర్చగా మారింది.పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాంటి బడా ఫ్రాంఛైజీలు టాప్ 3 ఆటగాళ్లపై ఎంత ఖర్చు చేస్తాయి..?రూ.43 కోట్లు దాటుతుందా..అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ రూ.43 కోట్ల ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. బీసీసీఐ ఏర్పాటు చేసిన రిటెన్షన్ శ్లాబ్ ప్రకారం రూ.43 కోట్లు బెంచ్‌మార్క్‌గా ఉంది. అంటే తొలి ప్లేయర్‌ పై రూ.18 కోట్లు, రెండవ ఆటగాడిపై రూ.14 కోట్లు మూడవ ఆటగాడిపై రూ.11 కోట్లు ఇలా ముగ్గురు ప్లేయర్స్‌కు కలిపి రూ.43 కోట్లు ఉంటుంది..

మొత్తానికి ఈ రోజు రేపు జరిగే ఐపీఎల్ 2024 మెగా ఆక్షన్‌లో ఏదైనా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు క్రీడాపండితులు. అత్యధిక ధర పలుకుతాడనుకునే ఆటగాడు ఈ మధ్య కాలంలో తన ప్రదర్శన సరిగ్గా లేకపోతే అతన్ని కొనుగోలు చేసేందు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపకపోవచ్చు.. లేదా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. మరోవైపు ఇప్పుడిప్పుడే మెరుస్తున్న ఆటగాడిపై కొన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేయొచ్చు. కాబట్టి ఆక్షన్‌లో ఏదైనా జరిగే అవకాశం ఉందని అంటున్నారు అనలిస్టులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+