World Cup 2023: టీమిండియాకు బిగ్ షాక్ - ఆల్ రౌండర్ దూరం..!!
ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. టాప్ రెండు స్థానాల్లో ఉన్న భారత్, కివీస్ మధ్య ఈ ఆదివారం కీలక పోరు జరగనుంది. ఈ సమయంలోనే టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యా.. టీమిండియా తదుపరి ఆడబోయే మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. హార్ధిక్‌ను హుటాహుటిన బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించినట్లు సమాచారం.
ప్రస్తుత ప్రపంచ కప్ లో టీమిండియా పూర్త ఫాంలో కనిపిస్తోంది. జట్టు అన్ని రంగాల్లోనూ సమిష్టిగా రాణిస్తోంది. ప్రస్తుతం పాయిట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న టీమిండియా..కివీస్ మధ్య ఆసక్తి కరపోరుకు ఈ ఆదివారం ధర్మశాల వేదిక కానుంది. ఇప్పటి వరకు బౌలింగ్..ఫీల్డింగ్ లో సత్తా చాటుతూ..బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ లో ధీమా పెంచుతున్న వైస్ కెప్టెన్ హార్డిక్ పాండ్యా కీలక మ్యాచ్ కు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో పాండ్యా ఆడటం కష్టమనేని సమాయారం. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ హార్దిక్ పాండ్యాను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి తరలించారు. దీంతో, వచ్చే మ్యాచ్ కు ఆడడని భావిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ మాత్రం హార్డిక్ గాయం గురించి ఆందోళన అవసరం లేదని చెబుతున్నాడు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపబోయి హార్దిక్ ఎడమ కాలిని గాయపరచుకున్నాడు. బంతిని ఆపే ప్రయత్నంలో హార్ధిక్ మడమ మడతపడటంతో నొప్పితో విలవిలలాడుతూ ఓవర్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మిగిలిన ఓవర్‌ను కోహ్లి పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా హార్ధిక్ బరిలోకి దిగలేదు. హార్ధిక్ గాయం అంత తీవ్రమైంది కాదని మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ చెప్పినప్పటికీ.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రకారం హార్ధిక్ న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకావం లేదని చెబుతున్నారు. ప్రపంచ కప్ లో వరుసగా మూడో విజయం టీమిండియా తాజాగా బంగ్లాదేశ్ మీద నమోదు చేసింది. టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆసీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీంను గెలిపించిన కింగ్ కోహ్లీ..తాజాగా బంగ్లాతో మ్యాచ్ లో సెంచరీ చేసాడు. ఇక, కివీస పైన గెలుపు ద్వారా తమ వరుస విజయాలు కొనసాగించాలని రోహిత్ సేన భావిస్తోంది. అదే సమయంలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజీలాండ్ సైతం తమ పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. దీంతో రెండు టీంల మధ్య ధర్మశాల మ్యాచ్ హోరీ హోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో హార్డిక్ గాయం కారణంగా దూరం కానున్నాడనే వార్త అభిమానులకు షాక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications