IPL 2025: యువ సంచలనాల వైపే ఫ్రాంచైజీల మొగ్గు - లిస్టులో ఉన్నదెవరు..!!
IPL Auction 2025: క్రికెట్ అభిమానులకు ఈ రెండు రోజులు ఉత్కంఠ పెంచే సమయం. క్రికెట్ ఫ్యాన్స్ ను కట్టి పడేసే ఐపీఎల్ 2025 కోసం మెగా ఆక్షన్ ఈ రోజు, రేపు సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరగనుంది. ఇప్పటికే టీంలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పై స్పష్టత వచ్చేసింది. ఇక, కొత్తగా ఎవరి జట్టులోకి ఎవరు వస్తారు.. ఎవరి రేటు ఏ మేర ఉంటుందనేది ఆసక్తిని పెంచుతోంది. ఈ సారి యువ ఆటగాళ్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గు చూపుతున్నారు. దీంతో, ఈ లిస్టు లో ఉన్నదెవరనేది మరింత ఉత్కంఠగా మారింది.
యువ క్రికెటర్లకు డిమాండ్
ఐపీఎల్ వేలానికి రంగం సిద్దమైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఈ ఆక్షన్ వైపు ఉత్కంఠగా చూస్తున్నారు. వేలానికి 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, అందులో 574 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో టీం ఇండియా తరపున అండర్ -19 ఆడిన యువ సంచలనాలపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో, ఈ లిస్టులో ఉన్న వారిని ఎవరు దక్కించుకుంటారనేది తేలాల్సి ఉంది. వారిలో ఉదయ్ సహారన్ కు డిమాండ్ కనిపిస్తోంది. ఈ యంగ్ ప్లేయర్ అండర్-19 ప్రపంచ కప్ లో జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. మొత్తం 7 మ్యాచ్ ల్లో 56.71 సగటుతో 397 పరుగులు చేసాడు. హిట్టింగ్ లో సహారన్ స్టైలే వేరు. సహారన్ వైపు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నారు.
ఐపీల్ వేలం 2025 LIVE: కాసుల వర్షం ఎవరిపై కురుస్తుంది..?

ఎవరి రేటు ఎంత
టీం ఇండియా ప్లేయర్ సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ కు డిమాండ్ కనిపిస్తోంది. అండర్ -19 ప్రపంచ కప్ లో ముషీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆరు మ్యాచుల్లో 60 యావరేజ్ తో 360 పరుగులు చేశాడు. ముషీర్ రంజీల్లోనూ తన మార్క్ చూపించాడు. ముషీర్ సైతం ఈ సారి ఆక్షన్ లో డిమాండ్ ఉన్న ప్లేయర్ గా కనిపిస్తున్నారు. మరో యంగ్ క్రికెటర్ సచిన్ దాస్ వైపు ప్రాంఛైజీలు ఆసక్తిని చూపిస్తున్నారు. అండర్ -19 ప్రపంచ కప్ లో ఆడిన ఏడు మ్యాచ్ ల్లో 303 పరుగులు చేసాడు. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న ఈ యువ సంచలనం వైపు ముంబై ఇండియన్స్ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఫ్రాంచైజీల మొగ్గు
ఈ జాబితాలో నెక్స్ట్ వినిపిస్తున్న పేరు అర్షిన్ కులకర్ణి. గత ఐపీఎల్ లో లక్నో టీం కులకర్ణిని దక్కించుకుంది. కానీ, ఆ టోర్నమెంట్ లో ఆడే అవకాశం దక్కలేదు. అండర్ -19 ప్రపంచ కప్ లో ఏడు మ్యాచ్ ల్లో 27 యావరేజ్ తో 189 పరుగులు చేసాడు. మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే విధంగా యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌమీ పాండే కు డిమాండ్ కనిపిస్తోంది. అండర్ -19 ప్రపంచ కప్ లో పాండే 18 వికెట్లు తీసి అందరూ తన వైపు చూసేలా చేసాడు. టీం ఇండియా నుంచి ఆ టోర్నీలో అధిక వికెట్లు తీసిన ఆటగాడుగా నిలిచాడు. సీనియర్లను ఇప్పటికే రిటైన్ చేసుకోవటంతో యువ క్రికెటర్లకు ఈ సారి డిమాండ్ ఎక్కువగా ఉంది. కోహ్లీ సైతం అండర్ -19 నుంచే తన కెరీర్ ప్రారంభించి.. సంచలన క్రికెటర్ గా ఎదిగాడు. దీంతో, ఈ సారి ఐపీఎల్ లో ఈ యువ సంచలనాల్లో ఎవరికి ఏ మేర డిమాండ్.. ఛాన్స్ ఉంటుందనేది తేలిపోనుంది.












Click it and Unblock the Notifications