ఓటమి బాధలో వున్న ఆటగాళ్లకు మ‌ద్ద‌తిచ్చిన‌ ఆనంద్ మహింద్రా...

ఐసీసీ ప్రపంచ కప్ 2023 చివ‌రి పోరులో టీమిండియా ఓటమి పాలైయ్యింది. గుజరాత్‌లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియంలో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఓట‌మిని చ‌విచూసింది. ఆస్ట్రేలియా ఆరోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది. అయితే, ఈ ఓట‌మి యావ‌త్ భార‌త‌దేశానికే బాధ క‌లిగించింది. ఈ ఓట‌మి భార‌త క్రికెట్ అభిమానుల‌ను భాదించినా, రోహిత్ సేన‌కు మాత్రం చాలామంది అండ‌గా నిలుస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా కూడా టీమిండియాకు త‌న మద్దతును ప్ర‌క‌టించారు.

అణుకువగా ఎలా వుండాలో నేర్పించడంలో క్రీడను మించిన గురువు లేడని ఆనంద్ మహింద్రా ఈ సంద‌ర్భంగా అన్నారు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా ప్ర‌ద‌ర్శ‌న చాలా గొప్ప‌గా ఉంది. గొప్ప క్రికెట్ ఆడింది, ఏరకంగా చూసినా టీమిండియా అద్భుతంగా రాణించిందని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా రోహిత్‌సేన ఆడింది. కానీ ఫైనల్ లో మాత్రం అనుకోకుండా ఓడిపోయింది. ఇలాంటి సమయంలోనే మనందరం టీమిండియాకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుంటుంద‌ని ఆనంద్ మహింద్రా సూచించడం జ‌రిగింది.

Anand Mahindra supported the players in the pain of defeat...

ఆట‌లో గెలుపు ఓటములు స‌హ‌జం..:ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ మొత్తం టీమిండియా ఎంతో అద్భుతంగా ఆడిందని, అయితే రోహిత్ సేన వరుస విజయాలకు అడ్డుక‌ట్ట వేస్తూ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అయితే ఈ ఓటమి ఎంతోమంది భార‌తీయుల‌ను నిరాశ‌కు గురిచేసింది. అయినా, చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం టీమిండియాకు పూర్తి మ‌ద్ద‌తును ప్ర‌క‌టిస్తున్నారు. ఈ వరల్డ్ కప్ ట్రోపి టీమిండియ గెలవలేకపోవచ్చు కానీ, టోర్నీ మొత్తం చాలా అద్భుతంగా ఆడి మా మనసులు గెలుచుకున్నారంటూ చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఓట‌మి భాద‌లో ఉన్న భార‌త్ ఆట‌గాళ్ల‌లో ఆత్మ‌స్థైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+