టీమిండియాకు బిగ్ షాక్: అర్ష్ దీప్ అవుట్- కొత్త ప్లేయర్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న అండర్సన్- టెండుల్కర్ టెస్ట్ సిరీస్ లో భారత్ వెనుకంజలో ఉంది. గెలిచాల్సిన మూడో మ్యాచ్ ఘోరంగా ఓడిపోయింది. చేతుల దాకా వచ్చిన మ్యాచ్ ను నోటి దాకా తీసుకెళ్లడంలో విఫలమైంది. 22 పరుగుల తేడాతో మట్టికరిచింది. అయిదు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తేడాతో వెనుకపడింది.

ఈ పరిస్థితుల మధ్య నాలుగో టెస్ట్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది భారత్. ఈ మ్యాచ్ ఈ నెల 23వ తేదీన ఆరంభం కానుంది. మాంచెస్టర్‌ లోని ఓల్డ్ ట్రాఫొర్డ్‌ స్టేడియం దీనికి వేదిక. ఇంకో రెండురోజుల్లో మ్యాచ్ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తో తలపడబోయే జట్టులో భారీ మార్పులకు టీమ్ మేనేజ్మెంట్ తెర తీసింది.

Anshul Kamboj added in India s Squad against England Test series

జట్టులో కొత్త ముఖానికి చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంభోజ్ కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ నుంచి పిలుపు అందింది. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ లో ఈ యంగ్ అండ్ డైనమిక్ పేస్ బౌలర్ ను ఆడించే అవకాశాలు లేకపోలేదు. మిగిలిన రెండు టెస్టు మ్యాచ్‌ల కోసం భారత జట్టులో చేరాడు.

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు గాయం కావడం వల్ల.. అతని స్థానంలో అన్షుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే అన్షుల్ మాంచెస్టర్‌కు బయలుదేరాడు కూడా. గురువారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో అర్ష్‌దీప్‌ గాయపడ్డాడు. అతని చేతికి కుట్లు కూడా పడ్డాయి.

అంతేకాకుండా లార్డ్స్ టెస్టులో గాయపడిన మరో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ స్థానంలో అన్షుల్ అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో ఇంగ్లాండ్ తో జరిగిన ఇండియా ఎ జట్టులో అన్షుల్ సభ్యుడు. ఆ రెండు మ్యాచ్‌లలో అయిదు వికెట్లు సైతం పడగొట్టాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై అతనికి మంచి అవగాహన ఉంది. దీంతో అతన్ని జట్టులోకి తీసుకుంది బీసీసీఐ.

వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా మాంచెస్టర్ టెస్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. లార్డ్స్ టెస్టు తొలిరోజు ఆటలో పంత్ వేలికి గాయం కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్ల తర్వాత కీపింగ్ చేయలేదు. పంత్ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ అతను ఆడకపోతే ధ్రువ్ జురెల్ తుది జట్టులో అతడి స్థానంలో ఆడతాడు.

కరుణ్ నాయర్ స్థానం కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లల్లో ఆకట్టుకోలేకపోయాడు. అతని స్థానంలో సాయి సుదర్శన్‌ కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. ఇంగ్లాండ్‌తో జరిగే 4వ టెస్టు తుదిజట్టులో- యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కేప్టెన్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్ ఆడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+