పనికిరాని పాకిస్థాన్ భారత్‌తో ఆడనంటుంది: Asaduddin

అంతర్జాతీయ క్రికెట్ వేదికపై మరోసారి భారత్-పాకిస్థాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో, పాకిస్థాన్ మరియు బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీనిపై ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

భద్రతా కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత్‌కు వచ్చేందుకు నిరాకరించింది. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేయగా, ఐసీసీ (ICC) అందుకు అంగీకరించకుండా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ రంగంలోకి దిగింది. ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన హై-ప్రొఫైల్ మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు.

Asaduddin

Asaduddin ఘాటు వ్యాఖ్యలు

ఈ పరిణామాలపై అసదుద్దీన్ ఓవైసీ నిజామాబాద్ లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "భారత్ టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తుంటే, ఆ పనికిరాని పాకిస్థాన్ టీమ్ భారత్‌తో ఆడబోమని చెబుతోంది. మనం వాళ్ళతో అనాల్సింది ఒక్కటే.. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు ఆడటం ఇష్టం లేకపోతే ఇక్కడి నుండి వెళ్ళిపోండి (Get out of here). వాళ్ళు మనపై పెత్తనం చలాయిస్తూ ఆడబోమని చెబుతుంటే, మీరు మాత్రం నిశ్శబ్దంగా వింటున్నారు. రక్తం, నీరు కలిసి ప్రవహించవు అన్న మాటలు ఏమయ్యాయి?" అని నిప్పులు చేరిగారు

మోనంగా ఎందుకున్నారు?: Asaduddin

బంగ్లాదేశ్ పర్యటన నిరాకరణను పాకిస్థాన్ సమర్థించడమే కాకుండా, భారత్‌తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించడం ద్వారా క్రీడల్లోకి రాజకీయాలను తీసుకువచ్చినట్లైందన్నారు. ఉగ్రవాదం,క్రికెట్ కలిసి సాగవని చెప్పే కేంద్ర ప్రభుత్వం, పాక్ మొండివైఖరిపై ఎందుకు మౌనంగా ఉందని ఓవైసీ ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+