ఆసియా కప్‌లో సంచలనం: ఫైనల్‌లో.. టీమిండియాతో: ఆ రెండు ఓవర్లల్లో ట్విస్ట్

కొలంబో: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ సూపర్ 4లో సంచలనం చోటు చేసుకుంది. ఫైనల్స్ చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతులెత్తేసింది. శ్రీలంక చేతిలో మట్టికరిచింది. ఫైనల్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ నెల 17వ తేదీన జరిగే ఫైనల్‌లో శ్రీలంక జట్టు.. భారత్‌ను ఢీకొట్టడానికి ఉవ్విళ్లూరుతోంది.

వర్షం వల్ల 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో అసలు సిసలు ఛాంపియన్ శ్రీలంకే. పాకిస్తాన్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి బంతి వరకూ పోరాడింది. మూడు పరుగుల తేడాతో ఏకంగా మూడు వికెట్లను కోల్పోయినప్పటికీ.. వెనుకంజ వేయలేదు. ఒక బంతికి రెండు పరుగులు చేయాల్సిన దశలో దాన్ని విజయవంతంగా ముగించింది.

 Asia cup 2023, IND vs SL: Pakistan knocked out after lost the key battle to Sri Lanka

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 42 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్ము లేపాడు. 73 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లతో 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 52, మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికర్ అహ్మద్- 47 పరుగులతో అతనికి అండగా నిలిచారు.

కేప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి విఫలం అయ్యాడు. 35 బంతుల్లో మూడు ఫోర్లతో 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మిగిలిన వారెవరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేకపోయారు. శ్రీలంక బౌలర్లల్లో మతీషా పతిరణ మూడు వికెట్లు నేల కూల్చాడు. ప్రమోద్ మదుసూదన్-2, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలెగె ఒక్కో వికెట్ తీసుకున్నారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బ్యాటర్లు అద్భుతంగా పోరాడారు. పాకిస్తాన్ బౌలింగ్‌కు ఎదురునిలిచారు. మూడో వికెట్ భాగస్వామ్యానికి ఏకంగా వంద పరుగులను జోడించడంతోనే లంకేయులు సగం విజయం సాధించినట్టయింది. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద ఉన్నప్పుడే తొలి వికెట్ కోల్పోయింది గానీ.. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు ఇన్నింగ్‌ను నిలబెట్టారు.

వన్ డౌన్ బ్యాటర్ కుశాల్ మెండిస్ 91 పరుగులతో చెలరేగాడు. 87 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో పాక్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఓపెనర్ పాథుమ్ నిశ్శంక- 29, కుశాల్ పెరీరా- 17 రాణించకపోయినా మిడిలార్డర్ బ్యాటర్లు వెన్నెముకగా నిలిచారు. సదీర సమరవిక్రమ- 48, చరిత్ అసలంక- 49 నాటౌట్.. జట్టును విజయ తీరాలకు చేర్చారు.

చివరి రెండు ఓవర్లల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 41వ ఓవర్ 4,5 బంతులకు విరుసగా రెండు వికెట్లను కోల్పోయింది శ్రీలంక. అప్పటికి జట్టు స్కోర్ 243 పరుగులు. 246 వద్ద ఉన్నప్పుడు చివరి నాలుగో బంతికి మరో వికెట్‌ను నష్టపోయింది. దీనితో మ్యాచ్ మొత్తం పాకిస్తాన్ వైపు మొగ్గు చూపినట్టే కనిపించినా.. అయిదో బంతికి నాలుగు, చివరి బంతికి రెండు పరుగులు సాధించాడు అసలంక. జట్టును గెలిపించాడు.

ఈ విజయంతో 11వ సారి ఆసియాకప్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది శ్రీలంక. డూ ఆర్ డై మ్యాచ్‌లో తనకంటే బలమైన పాకిస్తాన్‌ను ఓడించి సత్తా నిరూపించుకుంది. ఆదివారం ఇదే కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగే ఫైనల్స్‌లో టీమిండియాను ఢీ కొడుతుంది. ఇప్పటివరకు లంక ఆరుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+