Asia Cup Rising Stars:సూపర్ ఓవర్‌లో వైభవ్‌ని బ్యాటింగ్‌కు ఎందుకు పంపలేదు..?

దుబాయ్‌లో జరుగుతోన్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టీమిండియాకు ఊహించని షాక్ తగిలిన విషయం తెలిసిందే. సెమీఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ ఏ పై సూపర్ ఓవర్‌లో టీమిండియా ఏ జట్టు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్‌కు పంపకుండా భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. ఇంతకీ వైభవ్‌ను పంపకూడదన్న డెసిషన్ ఎవరిది..?

ఆ నిర్ణయమే కొంప ముంచింది
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025 సెమీఫైనల్స్‌ ఇండియా ఏ బంగ్లాదేశ్ ఏ మధ్య హోరాహోరీగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఏ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేసి 195 టార్గెట్ విధించింది. చేధించే క్రమంలో టీమిండియా అక్కడక్కడ తడబడ్డా చివరకు డ్రాగా ముగిసి సూపర్ ఓవర్‌కు తీసుకురాగలిగింది. ఇక సూపర్ ఓవర్‌లో గెలుస్తామనే ధీమా టీమిండియాలో గట్టిగా ఉన్నప్పటికీ ఒకే ఒక నిర్ణయం ఏకంగా భారత్‌ నిష్క్రమించేలా చేసింది. టోర్నమెంట్ మొత్తంలో అత్యధిక స్ట్రయిక్ రేట్ ఉన్న సూర్యవంశీని సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్‌కు పంపకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

asia-cup-rising-stars-jitesh-sharma-reveals-super-over-decision-as-why-suryavanshi-not-sent-to-bat

వైభవ్ ముఖంలో ఆవేదన
బ్యాటింగ్‌‌కు దిగిన జితేష్ శర్మ, అశుతోష్ శర్మలు రిపాన్ మోండల్ వేసిన వరుస బంతుల్లో ఔట్ కావడం ఆ తర్వాత ఒక పరుగుతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఫైనల్స్‌కు అడుగుపెట్టడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ సమయంలో 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ వైపే కెమెరాలు ఫోకస్ కాగా... ముఖంలో చాలా బాధ ఆవేదన కనిపించింది. చివరి మూడు ఓవర్లలో భారత్‌ విజయానికి 31 పరుగులు కావాల్సి ఉండగా.. డెత్ ఓవర్స్‌లో బంగ్లా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను కట్టడి చేసింది. టోర్నమెంటులో అత్యధిక పరుగులు సాధించిన వైభవ్ సూర్యవంశీ నిన్నటి మ్యాచ్‌లో కూడా 15 బంతుల్లో 38 పరుగులు చేసి అద్భుతమైన స్టార్ట్ అందించాడు. బంతిని బలంగా బాదగల సత్తా ఉన్న వైభవ్‌ను సూపర్ ఓవర్‌లో ఎందుకు పంపలేదని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ నిర్ణయం నాదే:జితేష్
ఇదిలా ఉంటే సూపర్ ఓవర్‌లో తను,అశుతోష్, రమణ్‌దీప్ సింగ్‌లు దిగాలన్న నిర్ణయం తనదే అని జితేష్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ సందర్భంగా తెలిపాడు. కొన్ని ఫ్యాక్టర్స్‌ను బేస్ చేసుకుని తాము ముగ్గురం బరిలో దిగాలని భావించినట్లు చెప్పిన జితేష్.. ఫలితం మాత్రం తారుమారైందని అన్నాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఏతో ఓటమి, బంగ్లాదేశ్‌తో ఓటమిని భారత్ జీర్ణించుకోలేకుంది.టీమిండియా సీనియర్ జట్టులోకి వచ్చేందుకు ఒక చక్కటి అవకాశాన్ని చాలామంది జూనియర్స్ చేజార్చుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బుడ్డోడు సూర్యవంశీ మాత్రం తన జట్టును విజయతీరాలకు చేర్చే అవకాశం రాకపోవడంపై చాలా నిరుత్సాహంతో కనిపించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+