Yashasvi Jaiswal century: బ్యాటింగ్ సునామీ- టీమిండియా కళ్లు చెదిరే స్కోర్
బీజింగ్: ఆసియా గేమ్స్ 2023 (Asian Games 2023)లో భాగంగా చైనాలోని హాంగ్ఝౌలో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. నేపాల్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సెంచరీతో సత్తా చాటాడు. ఆసియా గేమ్స్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
హాంగ్ఝౌ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లల్లో నాలుగు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో మెరిశాడు. సునామీ ఇన్నింగ్ ఆడాడు. చెప్పుకోదగ్గ అనుభవం లేని నేపాల్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి, అవుట్ అయ్యాడు.

అతని ఇన్నింగ్‌లో ఎనిమిది మెరుపు ఫోర్లు, ఏడు భారీ సిక్సర్లు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో చెలరేగాడో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్‌కు కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రుతురాజ్ గైక్వాడ్ 23 బంతుల్లో నాలుగు ఫోర్లతో 25 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. 15 బంతుల్లో రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 37, శివం దూబే- 25 పరుగులు చేశారు.
టాప్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ విఫలం అయ్యడు. 10 బంతులను ఎదుర్కొన్న ఈ హైదరాబాదీ రెండు పరుగులే చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ కూడా అయిదు పరుగులకే పెవిలియన్ చేరాడు. నేపాల్ బౌలర్లల్లో దీపేంద్ర సింగ్ ఐరే రెండు వికెట్లు పడగొట్టాడు. సోమ్‌పాల్ కర్ణి, సందీప్ లామిఛ్చానె ఖాతాలో ఒక్కో వికెట్ పడింది.
భారత్ నిర్దేశించిన భారీ స్కోర్‌ను ఛేదించే క్రమంలో నేపాల్ తడబడుతోంది. ప్రారంభ ఓవర్లలోనే వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్‌ను దూకుడుగా ఆరంభించినప్పటికీ.. వికెట్ పడటం స్పీడ్ బ్రేకర్‌లా మారింది. మూడు ఓవర్లలోనే 29 పరుగులు చేసింది నేపాల్. ఓపెనర్లు కుశాల్ భుర్టెల్- 16 పరుగులతో ఆడుతున్నాడు.
మరో ఓపెనర్ ఆసిఫ్ షేక్ ఆరు బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్‌తో 10 పరుగులు చేసి, అవేష్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అవేష్ ఖాన్ సంధించిన హార్డ్ లెంగ్త్ బంతిని లెగ్స్ దిశగా ఆడబోయి టైమింగ్ మిస్ అయ్యాడు. బ్యాట్ అంచులను తాకిన బంతి కాస్తా వికెట్ కీపర్ జితేష్ శర్మ చేతుల్లో వాలింది.












Click it and Unblock the Notifications