టీమిండియాకు బిగ్ బ్లో- దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ఆల్ రౌండర్ అవుట్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ దూరం అయ్యాడు. అనారోగ్యంతో అతను బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం లక్నోలో ఉన్న అక్షర్ పటేల్.. అక్కడే వైద్య పరీక్షలు చేయించుకోనున్నాడు. అక్షర్ పటేల్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో జరగాల్సిన మిగిలిన టీ20 మ్యాచ్ లకు షాబాజ్ అహ్మద్ అందుబాటులో ఉంటాడు.
దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడుతోంది భారత్. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ముగిశాయి. 2-1 తేడాతో టీమిండియా ఆధిక్యతను సాధించింది. ఇంకా రెండు మ్యాచ్ లు మిగిలివున్నాయి. ఈ రెండు కూడా ఈ నెల 17వ తేదీన లక్నో, 19వ తేదీన అహ్మదాబాద్‌లో జరగాల్సి ఉంది. ప్రస్తుతం జట్టు లక్నోలో ఉంటోంది. ఇక్కడి అటల్ బిహారీ వాజ్ పేయి ఏక్నా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. అక్షర్ పటేల్ కూడా జట్టుతోనే ఉన్నాడు. అనారోగ్యం బారిన పడటంతో ఆసుపత్రిలో అడ్మిట్ కానున్నాడు.

ధర్మశాల జరిగిన మూడో టీ20లో కూడా అక్షర్ పటేల్ ఆడని విషయం తెలిసిందే. నాలుగో మ్యాచ్ నాటికి అతని ఆరోగ్యం మెరుగుపడుతుందని భావించినప్పటికీ సాధ్యం కావట్లేదు. దీంతో ఈ సిరీస్ లో మిగిలిన రెండు మ్యాచ్ లకు కూడా దూరం అయ్యాడు. అతనికి బదులుగా ఈ చివరి రెండు టీ20 మ్యాచ్ లకు షాబాజ్ అహ్మద్ అందుబాటులో ఉంటాడు. తొలి రెండు మ్యాచ్ లల్లో అక్షర్ పటేల్ బ్యాటింగ్‌లో 23, 21 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.
ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ 214 లక్ష్యాన్ని ఛేదించే సమయంలో అక్షర్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై రవిచంద్రన్ అశ్విన్‌తో సహా పలువురు విశ్లేషకులు విమర్శలు చేశారు. ఆ ప్రయోగం వికటించింది. ఆ మ్యాచ్ లో ఓటమిని చవి చూడాల్సొచ్చింది టీమిండియాకు.
చివరి రెండు టీ20ల కోసం అందుబాటులో ఉన్న జట్టులో- సూర్యకుమార్ యాదవ్ (కేప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కేప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications