ఆ జాబితాలో రోహిత్ శర్మ
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలంలో అపురూపమైన రామమందిరం నిర్మితమైంది.
రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కోసం అయోధ్య సిద్ధమైంది. అయోధ్యాపురి మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇక్కడి ఆలయాలన్నింటినీ కూడా విద్యుద్దీపాలతో అలంకరించారు. రామ నామ జపంతో ఈ నగరం మారుమోగిపోతోంది. సరయూ నది తీరం మొత్తం రామభక్తులతో నిండిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.

ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి వేలాదిమంది ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగనుంది. రాజకీయ, సినీ, క్రీడా, సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రతినిధుల సమక్షంలో ఈ ఘట్టం పూర్తి కానుంది.
గవర్నర్లు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ప్రత్యక్షంగా రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించబోతున్నారు. ఆది, సోమవారాల్లో వారంతా అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకున్నారు భద్రత సిబ్బంది.
పలువురు క్రికెటర్లకు రామమందిరం ఆహ్వానపత్రికలు అందిన విషయం తెలిసిందే. టీమిండియా లెజెండరీ బ్యాటర్, భారతరత్న అవార్డు గ్రహీత సచిన్ టెండుల్కర్, మాజీ కేప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోనీ, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ.. ఈ ఆహ్వానపత్రికలను అందుకున్నారు.
వారితో పాటు మాజీ ప్లేయర్లు, ఎంపీలు హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కేప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. అయోధ్యను సందర్శించనున్నారు. వారందరూ తమ కుటుంబాలతో సహా అయోధ్యకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications